- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మొహం మీద దాన్ని పెట్టిన అభిమాని.. పిచ్చ కోపంతో అలా చేసిన స్టార్ హీరో.. నెటిజన్ల రియాక్షన్ ఇదే(వీడియో)

దిశ, వెబ్‌డెస్క్: మలయాళ హీరో ఉన్నీ ముకుందన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎన్నో సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అలాగే తెలుగులో భాగమతి మూవీలో అనుష్క శెట్టి ప్రియుడిగా నటించి మెప్పించాడు. అంతేకాకుండా జనతా గ్యారేజ్, యశోద వంటి చిత్రాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా, విలన్‌గా కూడా మెప్పించాడు. ఇక రీసెంట్‌గా మార్కో సినిమాతో పాన్ ఇండియా హీరోగా మారిపోయాడు. అయితే ఉన్నీ.. ఈ మధ్యన మలయాళంలో సోలో హీరోగా బాగా సక్సెస్ అవుతున్నాడు. ముఖ్యంగా మార్కో మూవీతో.. భారతీయ సినిమా ఇండస్ట్రీ చరిత్రలోనే ఇది ది మోస్ట్ వయిలెంట్ మూవీగా గుర్తింపు తెచ్చుకుంది.
మలయాళంతో పాటు తెలుగు, హిందీ, కన్నడ భాషల్లోనూ మార్కో సినిమాకు రికార్డు కలెక్షన్లు వచ్చాయి. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమాకు ఏకంగా రూ.100 కోట్లకు పైగా కలెక్షన్లు వచ్చాయి. ఇక హీరో ఉన్ని ముకుందన్ పేరు కూడా ఇప్పుడు మార్మోగిపోతోంది. ఈ క్రమంలో ఆయనకు సంబంధించిన ఒక వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో బాగా వైరలవుతోంది. ఇందులో ఒక మాల్‌లో కనిపించిన ఉన్నీ ముకుందన్‌తో ఫొటో దిగేందుకు ఒక అభిమాని ప్రయత్నించాడు. ఇందుకోసం హీరో ముఖం మీదే కెమెరా పెట్టేశాడు. దీంతో ముకుందన్ తీవ్ర అసౌకర్యానికి గురయ్యాడు. కోపం కట్టలు తెంచుకోవడంతో సదరు అభిమాని ఫోన్‌ను లాక్కొని జేబులో పెట్టేసుకుని వెళ్లిపోయడు.
అయితే అభిమాని వేడుకోవడంతో కొద్దిగా ముందుకు వెళ్లాక ఫోన్‌ను తనకు ఇచ్చేశాడు. దీంతో ఈ వీడియో కంప్లీట్ అవుతుంది. కాగా ఇది ఓల్డ్ వీడియోనా? కొత్త వీడియోనా? అన్నది క్లారిటీ అయితే రావడం లేదు. మొత్తానికి ఈ వీడియో మాత్రం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. దీనిని చూసిన సినీ అభిమానులు, నెటిజన్లు.. ఉన్నీ ముకుందన్ మరీ ఇంత యారోగెంట్‌గా ప్రవర్తించాల్సి కాదు అని కొంతమంది అంటుంటే, మరికొంత మంది మాత్రం.. మరీ అలా మొహం మీదే కెమెరా పెట్టాల్సిన అవసరం లేదు కదా అంటూ భిన్న రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. మరి మీరు ఈ వీడియోను ఓ సారి చూసేయండి.






