- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అందరి ముందే సాయిపల్లవి ఆపార్ట్ పై కిస్ చేసిన అభిమాని.. షాక్‌లో ఫ్యాన్స్.. వీడియో వైరల్
నేచురల్ బ్యూటీ సాయి పల్లవి(Sai Pallavi) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

దిశ, సినిమా: నేచురల్ బ్యూటీ సాయి పల్లవి(Sai Pallavi) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తాజాగా నాగ చైతన్య(Naga chaitanya) హీరోగా చందూ మొండేటి(Chandoo Mondeti) దర్శకత్వంలో వచ్చిన ‘తండేల్’(Thandel) సినిమాలో హీరోయిన్‌గా నటించి అలరించింది. తన యాక్టింగ్‌తో ఆడియన్స్ నుంచి ఫుల్ మార్కులే కొట్టేసింది. లవర్స్ డే కానుకగా అల్లు అరవింద్ (Allu aravind) సమర్పణలో గీతా ఆర్ట్స్ బ్యానర్ పై బన్నీ వాసు(Bunny Vasu) నిర్మించిన ఈ సినిమా ఫిబ్రవరి 7న రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ విజయం సాధించింది.
అంతేకాకుండా నాగ చైతన్య కెరీర్‌లోనే అత్యంత భారీ వసూళ్లు రాబడుతున్న సినిమాగా తండేల్ నిలుస్తోంది. ఇందులో భాగంగా కేవలం 10 రోజుల్లోనే ఈ సినిమా వంద కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టినట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. కాగా తండేల్ ప్రమోషన్లలో ఒక ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. వివరాల్లోకి వెళితే.. విడుదలకు ముందు తండేల్ జాతర ఈవెంట్ జరిగిన సంగతి తెలిసిందే.
అయితే ఈ కార్యక్రమంలో ఓ మహిళా అభిమాని ఎలాగోలా సాయిపల్లవి దగ్గరకు వచ్చేసింది. హీరోయిన్‌తో సెల్ఫీలు, ఫొటోలు దిగింది. ఆ తర్వాత హీరోయిన్‌కు షేక్‌హ్యాండ్ కూడా ఇచ్చింది. దీంతో తెగ సంతోష పడిపోయిన ఆమె సాయిపల్లవి చేతికి ముద్దు పెట్టేసి అక్కడి నుంచి వెళ్లిపోయింది. అయితే ఈ వీడియో ఆలస్యంగా వెలుగులోకి రాగా ఇప్పుడు నెట్టింట బాగా వైరలవుతోంది. ఇక దీన్ని చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు. కాగా సాయి పల్లవి ప్రేమమ్’(Premam) మూవీతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి.. తన ఫస్ట్ సినిమాతోనే మంచి గుర్తింపు సంపాదించుకున్నది.
ఆ తర్వాత ‘ఫిదా’(Fidaa) సినిమాలో నటించి మెప్పించింది. అంతే కాకుండా తన యాక్టింగ్‌తో అందరినీ మంత్ర ముగ్ధుల్ని చేసేసింది. దీంతో వరుస ఆఫర్లు క్యూ కడుతున్నాయి. అంతే కాకుండా బోల్డ్ సీన్స్‌లో యాక్ట్ చేయకపోవడం, మేకప్ వేసుకోకపోవడం వల్ల మరింత ఫేమ్ అయింది. ఇక ఈ భామ డ్యాన్స్‌కి అయితే ప్రత్యేక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందనే చెప్పాలి. అయితే సాయి పల్లవి రీసెంట్‌గా ‘అమరన్’(amaran) మూవీతో మంచి విజయం సాధించిన సంగతి తెలిసిందే.






