The Family Man: యాక్షన్ అండ్ ఫ్యామిలీ సీన్స్‌తో ఆకట్టుకుంటోన్న ‘ది ఫ్యామిలీ మ్యాన్’ ట్రైలర్

by Chukka Sudharani |

ప్రేక్షకుల్లో విశేష ఆదరణ పొందిన వెబ్‌సిరీస్‌ల్లో ‘ది ఫ్యామిలీ మ్యాన్’ ఒకటి.

The Family Man: యాక్షన్ అండ్ ఫ్యామిలీ సీన్స్‌తో ఆకట్టుకుంటోన్న ‘ది ఫ్యామిలీ మ్యాన్’ ట్రైలర్
X

దిశ, సినిమా: ప్రేక్షకుల్లో విశేష ఆదరణ పొందిన వెబ్‌సిరీస్‌ల్లో ‘ది ఫ్యామిలీ మ్యాన్’ ఒకటి. ఈ సిరీస్ దాదాపు రెండు సీజన్లను పూర్తి చేసుకోగా.. భారీ సక్సెస్ అందుకున్నాయి. ఈక్రమంలోనే.. ఇప్పుడు దీనికి కొనసాగింపుగా ది ఫ్యామిలీ మ్యాన్ 3 రాబోతున్న విషయం తెలిసిందే. నవంబర్ 21 నుంచి తెలుగుతో పాటు తమిళం, మలయాళం, హిందీ భాషల్లో ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అయ్యేందుకు సిద్ధం అవుతున్న ఈ సిరీస్ నుంచి తాజాగా ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. యాక్షన్ సీన్స్ అండ్ ఫ్యామిలీ సెంటిమెంట్‌తో ఈ ట్రైలర్ ఆకట్టుకుంటోంది. కాగా.. రాజ్ అండ్ డీకే దర్శకత్వంలో తెరకెక్కిన ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్‌లో మనోజ్ బాజ్‌పేయి మరోసారి శ్రీకాంత్ తీవారీ పాత్రలో కనిపించబోతుండగా.. ప్రియమణి, షరీబ్ హష్మి, ఆశ్లేష ఠాకూర్, శరద్ ఖేల్కర్, సందీప్ కిషన్, శ్రేయా ధన్వంతరి, అభయ్ వర్మ కీలక పాత్రలో నటించారు. ఇందులో పాతాళ్ లోక్ నటుడు జైదీప్ అహ్లవత్ విలన్‌గా కనిపించబోతున్నాడు. లింక్


Next Story