The Family Man-3: విడుదలకు సిద్ధమైన ‘ది ఫ్యామిలీ మ్యాన్-3’.. వైరల్ అవుతున్న న్యూస్

by I. Sairam |

ఇప్పటికే టు పార్ట్స్‌గా వచ్చిన ‘ది ఫ్యామిలీ మ్యాన్’ వెబ్ సిరీస్ ప్రేక్షకులను ఎంతగా ఆకట్టుకుందో స్పెషల్‌గా చెప్పనక్కర్లేదు.

The Family Man-3: విడుదలకు సిద్ధమైన ‘ది ఫ్యామిలీ మ్యాన్-3’.. వైరల్ అవుతున్న న్యూస్
X

దిశ, సినిమా: ఇప్పటికే టు పార్ట్స్‌గా వచ్చిన ‘ది ఫ్యామిలీ మ్యాన్’ వెబ్ సిరీస్ ప్రేక్షకులను ఎంతగా ఆకట్టుకుందో స్పెషల్‌గా చెప్పనక్కర్లేదు. ఈ సిరీస్‌లకు రాజ్ అండ్ డీకే(Raj& DK) దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం ఈ వెబ్‌సిరీస్‌కు సీక్వెల్‌గా మూడో పార్ట్ కూడా వస్తోందన్న సంగతి తెలిసిందే. స్పై యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ సిరీస్‌లో మనోజ్ బాజ్‌పేయి(Manoj Bajpayee), ప్రియమణి(Priyamani), షరీబ్ హష్మీ(Shareeb Hasmi), శ్రేయా ధన్వంతరి(Shreya Dhanvantari), వేదాంత్ సిన్హా(Vedanth Sinha) వంటి ప్రముఖులు కీలక పాత్రలో నటించారు.

ప్రస్తుతం ‘ది ఫ్యామిలీ మ్యాన్ 3’ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ దాదాపుగా పూర్తి అయిందని.. అవుట్ ఫుట్ అద్భుతంగా ఉందని తెలుస్తోంది. దీంతో ‘ది ఫ్యామిలీ మ్యాన్- 3’(The Family Man-3) కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా ఈ సిరీస్ మూడో పార్ట్ త్వరలోనే రిలీజ్ కానున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా రీసెంట్‌గా ఈ మూడో పార్ట్ పై మనోజ్‌ బాజ్‌పేయీ క్లారిటీ ఇస్తూ.. ‘త్వరలో సరికొత్తగా ఈ ఫ్యామిలీ మ్యాన్‌ మీ ముందుకు రాబోతున్నాడు’’ అని ఆయన చెప్పుకొచ్చారు. దీంతో త్వరలోనే ఈ సిరీస్ స్ట్రీమింగ్‌కి రాబోతున్నట్లు తెలుస్తోంది. కాగా ఈ మూడో సీజన్‌లో దేశభక్తుడైన గూఢచార పోలీసు అధికారి శ్రీకాంత్‌ తివారీగా మనోజ్‌ బాజ్‌పేయీ కనిపించనున్నారు.

Next Story