- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
జీవితంలో ఎదురైన అనుభవాల వల్ల చాలా విషయాలపై క్లారిటీ వచ్చింది: నుష్రత్ భరుచ్చా
ఇప్పుడు ప్రతి ఒక్కరికీ ప్రతి విషయం మీద ఒక అభిప్రాయం ఉంటోంది. మనం ఏదైనా చెబితే దాన్ని తప్పుగా అర్థం చేసుకుని వివాదాలు చేసే అవకాశం ఉంది.

దిశ, సినిమా: బాలీవుడ్ యంగ్ హీరోయిన్ నుష్రత్ భరుచ్చా ‘ప్యార్ కా పంచనామా’ సినిమాతో ఇండస్ట్రీకి వచ్చి అతి తక్కువ కాలంలోనే ఫుల్ పాపులారిటీ రాబట్టుకుంది. అంతేకాకుండా ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాల్లో నటించిన ఆమె, స్టార్ హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకొని తన పాపులారిటీని మరింత పెంచుకుంది. ఇక తెలుగులో ‘తాజ్ మహల్’ మూవీలో నటించింది. ఒక్క సినిమా చేసినప్పటికీ అందరినీ తన నటనతో మాయ చేసిందని చెప్పాలి. గతేడాది నుష్రత్ ‘ఉఫ్ యే సియప్పా’ అనే చిత్రంతో ప్రేక్షకులను మంత్రముగ్దులను చేసింది. ఇక ప్రస్తుతం ఘూస్‌ఖోర్ పండిట్, బున్ టిక్కీ, లవ్ రంజన్ వంటి సినిమాలతో ఫుల్ బిజీగా గడుపుతోంది. తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నుష్రత్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. సినిమాల్లో హీరోయిన్ల పాత్రల గురించి నుష్రత్ మాట్లాడుతూ.. "మహిళలను కేవలం చాలా తెలివైన వారు అనో లేదా ఏమీ తెలియని అమాయకులు అనో అనలేం. పరిస్థితిని బట్టే మనిషి ప్రవర్తన మారుతుంది. ఎంత ధైర్యం ఉన్న మహిళకైనా కొన్నిసార్లు నిస్సహాయంగా అనిపించవచ్చు. కానీ, కథ ఎప్పుడూ ఆమె ఏడుస్తూ కూర్చున్నట్లు ముగియకూడదు. ఆ కష్టం నుంచి ఆమె ఎలా బయటపడింది, ఎలా గెలిచింది అనేదే ముఖ్యం.
అన్ని రకాల మహిళల జీవితాలను తెరపై చూపించాలి" అని ఆమె చెప్పారు. నేటి రోజుల్లో సోషల్ మీడియాలో ఎప్పుడు మాట్లాడాలి, ఎప్పుడు మౌనంగా ఉండాలో తెలుసుకోవడం చాలా ముఖ్యమని నుష్రత్ అభిప్రాయపడ్డారు. "ఇప్పుడు ప్రతి ఒక్కరికీ ప్రతి విషయం మీద ఒక అభిప్రాయం ఉంటోంది. మనం ఏదైనా చెబితే దాన్ని తప్పుగా అర్థం చేసుకుని వివాదాలు చేసే అవకాశం ఉంది. అందుకే మాట్లాడే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తాను. జీవితంలో ఎదురైన అనుభవాల వల్ల నాకు చాలా విషయాల మీద స్పష్టత వచ్చింది. అందుకే ఇప్పుడు నేను చాలా ప్రశాంతంగా ఉండగలుగుతున్నాను" అని ఆమె తెలిపారు. గతేడాది ఆమె 'ఉఫ్ యే సియప్పా' అనే సైలెంట్ సినిమాలో నటించారు. అందులో డైలాగులు ఉండవు, కేవలం హావభావాలతోనే నటించడంపై స్సందిస్తూ.. "మొదట్లో డైలాగులు లేకుండా ఎలా నటించాలా అని టెన్షన్ పడ్డాను. కానీ, ఆ అనుభవం నాలో కొత్త ఉత్సాహాన్ని నింపింది. మాటలు లేకుండానే నాలోని నటనను బయటపెట్టే అవకాశం దక్కింది" అని ఆమె సంతోషం వ్యక్తం చేశారు.
బంపర్ ఆఫర్ కొట్టేసిన పూజా హెగ్డే.. అల్లు అర్జున్ సరసన మరోసారి రొమాన్స్!






