- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బంపర్ ఆఫర్ కొట్టేసిన పూజా హెగ్డే.. అల్లు అర్జున్ సరసన మరోసారి రొమాన్స్!
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సెన్సేషనల్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ కాంబినేషన్‌లో రాబోతున్న భారీ ప్రాజెక్ట్ 'AA-23'లో పూజా హీరోయిన్‌గా ఎంపికైనట్లు సమాచారం.

దిశ, సినిమా: టాలీవుడ్ బుట్టబొమ్మ పూజా హెగ్డేకు గత కొద్ది కాలంగా బ్యాడ్ టైమ్ నడుస్తోంది. ఆమె చేసిన సినిమాలన్నీ బాక్సాఫీసు వద్ద ఆశించినంత స్థాయిలో మెప్పించలేకపోతున్నాయి. అయినప్పటికీ అమ్మడు క్రేజ్ ఏమాత్రం తగ్గడంలేదు. కోలీవుడ్,బాలీవుడ్, టాలీవుడ్, మాలీవుడ్ ఇండస్ట్రీలోని స్టార్ హీరోల సరసన చాన్స్ దక్కించుకుంటూ దూసుకుపోతోంది. ఈక్రమంలో తాజాగా, పూజా హెగ్డే గురించి ఒక అదిరిపోయే అప్‌డేట్ ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. గత కొంతకాలంగా సరైన సక్సెస్ లేక ఇబ్బంది పడుతున్న ఈ అమ్మడు ఒక మెగా ఆఫర్‌ను అందుకున్నట్లు టాక్. 2022లో ఎఫ్-3లో కనిపించగా.. దాదాపు నాలుగేళ్ల విరామం తర్వాత పూజా హెగ్డే మళ్లీ టాలీవుడ్ తెరపై మెరవబోతోంది. అది కూడా సాదాసీదా సినిమాతో కాదు.. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సెన్సేషనల్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ కాంబినేషన్‌లో రాబోతున్న భారీ ప్రాజెక్ట్ 'AA-23'లో పూజా హీరోయిన్‌గా ఎంపికైనట్లు సమాచారం.
ఈ సినిమా కోసం మేకర్స్ ఆమెను సంప్రదించగా, లోకేష్ చెప్పిన కథ, తన పాత్ర నచ్చడంతో పూజా వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిందని టాక్. త్వరలోనే షూటింగ్‌లోనూ పాల్గొనబోతున్నట్లు సోషల్ మీడియాలో పలు పోస్టులు వైరల్‌గా మారాయి. కాగా.. గతంలో 2020లో వచ్చిన అలా వైకుంఠపురంలో, దువ్వాడ జగన్నాథం వంటి సినిమాలో అల్లు అర్జున్, పూజా హెగ్డే జోడీ వెండితెరపై మ్యాజిక్ చేసింది. ఈ చిత్రాలు మంచి టాక్ రాబట్టుకోవడమే కాకుండా, వీరిద్దరి కెమిస్ట్రీకి ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఇప్పుడు మళ్లీ ఇన్నాళ్ల తర్వాత ఈ హిట్ పెయిర్ ముచ్చటగా మూడోసారి కలిసి నటిస్తుండటంతో అభిమానుల్లో అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ప్రస్తుతం పూజా హెగ్డే కేవలం తెలుగులోనే కాదు, కోలీవుడ్, బాలీవుడ్‌లోనూ ఫుల్ బిజీగా ఉంది. కోలీవుడ్ స్టార్ విజయ్ ‘జన నాయగన్’, మలయాళంలో దుల్కర్ సల్మాన్‌తో ‘DQ-41’ చిత్రాలతో పాటు హిందీలో ‘హై జవానీతో ఇష్క్ హోనా హై’ వంటి సినిమాల్లో నటిస్తోంది.






