OPERATION SINDOOR: దేశ సరిహద్దుల యుద్ధం ఎఫెక్ట్.. కీలక ప్రకటన విడుదల చేసిన ‘థగ్‌లైఫ్’ మూవీ మేకర్స్ (ట్వీట్)

by Mallepaka Hamsa |   (  Updated:2025-05-09 10:33:15  IST  )

కోలీవుడ్ స్టార్ హీరో కమల్ హాసన్(Kamal Haasan), మణిరత్నం(Maniratnam) కాంబోలో రాబోతున్న లేటెస్ట్ యాక్షన్ డ్రామా ‘థగ్‌లైఫ్’(Thuglife).

OPERATION SINDOOR: దేశ సరిహద్దుల యుద్ధం ఎఫెక్ట్.. కీలక ప్రకటన విడుదల చేసిన ‘థగ్‌లైఫ్’ మూవీ మేకర్స్ (ట్వీట్)
X

దిశ, సినిమా: కోలీవుడ్ స్టార్ హీరో కమల్ హాసన్(Kamal Haasan), మణిరత్నం(Maniratnam) కాంబోలో రాబోతున్న లేటెస్ట్ యాక్షన్ డ్రామా ‘థగ్‌లైఫ్’(Thuglife). మల్టీ స్టారర్‌గా తెరకెక్కతున్న ఈ సినిమాలోస్టార్ హీరో శింబు ప్రధాన పాత్రలో నటిస్తుండగా.. త్రిష, నాజర్, అభిరామి, జోజు జార్జ్, ఐశ్వర్య లక్ష్మి(Aishwarya Lakshmi), మహేష్ మంజ్రేకర్(Mahesh Manjrekar) కీలక పాత్రలో కనిపించబోతున్నారు. ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని కమల్‌హాసన్‌కు చెందిన రాజ్ కమల్ ఫిలిం ఇంటర్నేషనల్, మద్రాస్ టాకీస్, రెడ్‌జెయింట్ మూవీస్ బ్యానర్స్‌పై భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది.

ఇక ఈ సినిమా భారీ అంచనాల మధ్య జూన్ 5న థియేటర్స్‌లోకి రాబోతుంది. ఈక్రమంలో.. మూవీ మేకర్స్ వరుస అప్డేట్స్ రిలీజ్ చేస్తున్నారు. అయితే ఆడియో లాంచ్ ఈవెంట్ మే 16న నిర్వహించాలని చిత్రబృందం నిర్ణయించుకున్నారు. ఈ నేపథ్యంలోనే ఆపరేషన్ సిందూర్ జరగడంతో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ట్విట్టర్ ద్వారా ఓ ప్రకటన విడుదల చేశారు. ‘‘మన దేశ సరిహద్దుల్లో జరుగుతున్న పరిణామాలు, ప్రస్తుత హెచ్చరికలు దృష్ట్యా మే 16 జరగాల్సిన ‘థగ్‌లైఫ్’ఆడియో లాంచ్ వాయిదా వేస్తున్నాం.

మళ్లీ రీ షెడ్యూల్ చేయాలని మేము నిర్ణయించుకున్నాం. మన సైనికులు మాతృభూమి రక్షణలో ధైర్యసాహసాలతో ముందు వరుసలో స్థిరంగా నిలబడినందున వేడకలు చేసుకునే సమయం కాదు అని నమ్ముతున్నాము. కొత్త తేదీని త్వరలోనే ప్రకటిస్తాము. ఈ సమయంలో ఆలోచనలన్నీ మన దేశాన్ని రక్షిస్తూ, అప్రమత్తంగా ఉండే మన సాయుధ ధళాల ధైర్య పురుషులు, స్త్రీలతో ఉంటాయని అనుకుంటున్నాము’’ అని రాసుకొచ్చారు. ప్రస్తుతం మేకర్స్ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. అది చూసిన వారంతా మంచి నిర్ణయం అని ప్రశంసలు కురిపిస్తున్నారు.

Click For Tweet..

Next Story