Vijay Deverakonda: విజయ్ దేవరకొండ కింగ్‌డమ్ రీషూట్ చేయనున్న డైరెక్టర్.. కారణంగా ఏంటంటే?

by Chukka Sudharani |

రౌడీ హీరో విజయ్ దేవరకొండ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘కింగ్‌డమ్’.

Vijay Deverakonda: విజయ్ దేవరకొండ కింగ్‌డమ్ రీషూట్ చేయనున్న డైరెక్టర్.. కారణంగా ఏంటంటే?
X

దిశ, సినిమా: రౌడీ హీరో విజయ్ దేవరకొండ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘కింగ్‌డమ్’. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో యంగ్ బ్యూటీ భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటిస్తుంది. కాగా.. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ జూలై 4న రిలీజ్ కాబోతున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల విడుదల వాయిదా పడింది. ఇక ఈ సమ్మర్‌లోనే రిలీజ్ చేసే అవకాశాలు ఉన్నట్లు మేకర్స్ చెప్పగా.. ఇప్పుడు ఇది కూడా లేట్ అయ్యేలా కనిపిస్తుంది. తాజా సమాచారం మేరకు కింగ్‌డమ్ చివరి కట్ చూసిన తర్వాత దర్శకుడు గౌతమ్ తిన్ననూరి అండ్ సినిమా బృందం తిరిగి షూట్ చేయాలని నిర్ణయించుకున్నారట.

ప్రస్తుతం ఈ బృందం గోవాలో విజయ్ దేవరకొండకు సంబంధించిన కొన్ని సన్నివేశాలను తిరిగి షూట్ చేస్తోందని తెలుస్తోంది. ప్రజెంట్ ఈ న్యూస్ నెట్టింట చక్కర్లు కొట్టడంతో.. ఈ సినిమా ఇప్పట్లో రిలీజ్ కాదేమో అంటూ సందేహం వ్యక్తం చేస్తున్నారు ఫ్యాన్స్. కాగా.. ఈ యాక్షన్ థ్రిల్లర్ సినిమాను సితార ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌పై సాయి సౌజన్య, సూర్య దేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నాడు.

Next Story