‘28°C’: టైటిల్ వెనుక రహస్యాన్ని చెప్పిన డైరెక్టర్.. చివరి వరకు క్యూరియాటితోనే ఉంటుందంటూ..

by Chukka Sudharani |   (  Updated:2025-03-29 15:46:03  IST  )

నవీన్ చంద్ర (Naveen Chandra) హీరోగా, షాలినీ వడ్నికట్టి (Shalini Vadnikatty) హీరోయిన్‌గా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘28°C’.

‘28°C’: టైటిల్ వెనుక రహస్యాన్ని చెప్పిన డైరెక్టర్.. చివరి వరకు క్యూరియాటితోనే ఉంటుందంటూ..
X

దిశ, సినిమా: నవీన్ చంద్ర (Naveen Chandra) హీరోగా, షాలినీ వడ్నికట్టి (Shalini Vadnikatty) హీరోయిన్‌గా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘28°C’. ‘పొలిమేర’ ఫేమ్ డైరెక్టర్ అనిల్ విశ్వనాథ్ (Anil Vishwanath) తెరకెక్కిస్తునన ఈ చిత్రం ఏప్రిల్ 4న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు రెడీ అవుతోంది. ఎమోషనల్‌గా సాగే అద్భుతమైన ప్రేమ కథ చిత్రాన్ని వీరాంజనేయ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ప్రొడ్యూసర్ సాయి అభిషేక్ నిర్మిస్తున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న డైరెక్టర్ అనిల్ విశ్వనాథ్ ‘28°C’ సినిమాకు సంబంధించి ఇంట్రెస్టింగ్ విషయాలు పంచుకున్నారు.

‘‘28°C’ సినిమాతో నాకు ఎమోషనల్ కనెక్షన్ ఉంది. ఇది మొదటి సినిమా. స్క్రిప్ట్‌ను బాగా లవ్ చేశాను. 2017లో స్టార్ట్ చేశాం. క్వాలిటీ పరంగా రాజీ పడకపోవడంతో బడ్జెట్ పెరిగింది. 2020 మేలో రిలీజ్‌కు ప్లాన్ చెయ్యగా.. అప్పుడు లాక్ డౌన్ (Lock down) కారణంగా వాయిదా పడింది. ఓటీటీ(OTT)కి ఆఫర్స్ వచ్చాయి గానీ మేము సినిమాకు పెట్టిన ఖర్చుకు వారు ఆడిగిన రేట్‌కు సంబంధం లేదు. అందుకే మూవీని ఓటీటీకి ఇవ్వలేదు. పైగా మా సినిమాను థియేటర్స్‌లో రిలీజ్ చేసుకోవాలనే కోరిక ఉండేది. ఏది జరిగినా మన మంచికే అనుకుంటా. ఈ సినిమా ఇప్పుడు రిలీజ్ కావడం వల్ల మంచే జరిగిందని భావిస్తా. ఇద్దరు మెడికల్ స్టూడెంట్స్ మధ్య జరిగే ప్రేమ కథ ఇది.

థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ (Thrilling elements), సూపర్ న్యాచురల్ షేడ్స్ (Super natural shades) ఉంటాయి. మెడికల్‌గా 28°C అనే అంశాన్ని కథలో మిక్స్ చేశాం. బ్రెయిన్ డ్యామేజీ అయిన వారు ఎక్కువ వేడి, చల్లదనం తట్టుకోలేరు. అది థియరీగా ఉంది. ఈ అంశాన్ని సినిమా కోసం ఎఫెక్టివ్‌గా ఉపయోగించాం. టైటిల్ కనిపించే ప్రశ్నార్థకం మిమ్మల్ని సినిమా చివరి వరకు క్యూరియాసిటికి గురిచేస్తుంది. ఈ సినిమాను మొదట అడివి శేష్ (Adivi Sesh) కోసం అనుకున్నాం. అయితే శేష్ క్షణం తర్వాత బిజీ అవడం వల్ల కుదరలేదు. నవీన్ చంద్రకు స్క్రిప్ట్ చెబితే ఆయనకు బాగా నచ్చి చేసేందుకు ముందుకొచ్చారు’ అని చెప్పుకొచ్చారు. ఇక త్వరలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌ (Bellamkonda Sai Srinivas)తో ఇన్వెస్టిగేటివ్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ చేస్తున్నట్లు తెలిపారు.

Next Story