- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నేను డ్రెస్ చేంజ్ చేసుకుంటున్నప్పుడు ఆ డైరెక్టర్ నన్ను న్యూడ్‌గా చూసేశాడు.. టాలీవుడ్ క్రేజీ హీరోయిన్ సంచలన కామెంట్స్
సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా(Sandeep Reddy Vanga) దర్శకత్వంలో తెరకెక్కిన ‘అర్జున్ రెడ్డి’(Arjun Reddy) సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న యంగ్ బ్యూటీ షాలిని పాండే(Shalini Pandey) మనందరికీ సుపరిచితమే.

దిశ, వెబ్‌డెస్క్: సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా(Sandeep Reddy Vanga) దర్శకత్వంలో తెరకెక్కిన ‘అర్జున్ రెడ్డి’(Arjun Reddy) సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న యంగ్ బ్యూటీ షాలిని పాండే(Shalini Pandey) మనందరికీ సుపరిచితమే. ఈ మూవీలో తన నటనతో ప్రేక్షకులకు దగ్గరయింది ఈ ముద్దుగుమ్మ. దీంతో ఆఫర్లు క్యూ కట్టాయి. అలా ‘మహానటి’(Mahanati), ‘ఎన్.టి.ఆర్’(NTR), ‘118’, ‘ఇద్దరి లోకం ఒకటే’(Iddari Lokam Okate) వంటి సినిమాల్లో నటించి మెప్పించింది. కానీ, అనుకున్నంత స్థాయిలో విజయాలు సాధించలేదు. దీంతో కొంతకాలం తెలుగు పరిశ్రమకు దూరంగా ఉంటూ, బాలీవుడ్ ఇండస్ట్రీపై దృష్టి పెట్టింది.
అయితే ఇటీవల ఒక ఇంటర్వ్యూలో షాలిని పాండే తన కెరీర్‌లో ఎదురైన ఓ షాకింగ్ అనుభవాన్ని వెల్లడించింది. ఆమె మాట్లాడుతూ.. ‘నేను వ్యానిటీ వ్యాన్‌లో బట్టలు మార్చుకుంటున్న సమయంలో ఓ స్టార్ డైరెక్టర్ నా అనుమతి లేకుండా లోపలికి వచ్చాడు. అప్పుడు నన్ను అతను న్యూడ్‌గా చూసేశాడు. కానీ ఇదంతా ఇండస్ట్రీలో కామన్’ అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ బ్యూటీ చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్‌గా మారాయి. కాగా ఆ డైరెక్టర్ నేమ్, ఏ సినిమా అనేది మాత్రం వెల్లడించలేదు.






