ఆ డైరెక్టర్ అలాంటి బట్టలు వేసుకో అన్నాడు.. స్టార్ హీరోయిన్ సంచలన వ్యాఖ్యలు

by Mallepaka Hamsa |

గత కొద్ది రోజుల నుంచి సినిమా ఇండస్ట్రీకిలో క్యాస్టింగ్ కౌచ్‌ జరుగుతున్నట్లు ఎంతో మంది తమ ఆవేదన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.

ఆ డైరెక్టర్ అలాంటి బట్టలు వేసుకో అన్నాడు.. స్టార్ హీరోయిన్ సంచలన వ్యాఖ్యలు
X

దిశ, సినిమా: గత కొద్ది రోజుల నుంచి సినిమా ఇండస్ట్రీకిలో క్యాస్టింగ్ కౌచ్‌ జరుగుతున్నట్లు ఎంతో మంది తమ ఆవేదన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఈ రంగుల ప్రపంచంలో రాణించడానికి కొందరు అవన్నీ తట్టుకుని స్టార్ హీరోయిన్స్‌గా ఎదిగారు. కానీ మరికొందరు మాత్రం వేధింపులకు గురి చేసిన వారికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఇటీవల కొందరు పరువు పోతుందని ఆలోచించి క్యాస్టింగ్ కౌచ్‌పై నోరు విప్పనప్పటికీ మరికొందరు మాత్రం తమకు ఎదురైన చేదు అనుభవాలను ధైర్యంగా చెబుతున్నారు. తాజాగా, ఓ స్టార్ హీరోయిన్‌కు కూడా ఇలాంటి అనుభవమే ఎదురైనట్లు తెలిపింది.

ఒకప్పుడు టాలీవుడ్ స్టార్ హీరోలు బాలకృష్ణ, వెంకటేష్(Venkatesh), శ్రీకాంత్, మోహన్ బాబు(Mohan Babu) వంటి వారితో నటించిన లైలా అందరికీ సుపరిచితమే. తెలుగు, తమిళ సినిమాలతో ఫుల్ క్రేజ్ తెచ్చుకున్న ఆమె చివరగా.. ‘సర్దార్’(Sardar) లో నటించింది. ఆ తర్వాత ఇండస్ట్రీకి దూరం అయింది. ఇదిలా ఉంటే.. తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న లైలా షాకింగ్ కామెంట్స్ చేసి వార్తల్లో నిలిచింది. ‘‘పొట్టి స్కర్టులు(Short skirts), చిన్న టాప్స్ వేసుకోమని అడిగే దర్శకులు ఇండస్ట్రీలో చాలా మంది ఉన్నారు. ప్యాడ్స్ కూడా పెట్టుకోమని చెప్పేవారు. కానీ దానికి నేను మాత్రం ఒప్పుకోలేదు.

ఒక దర్శకుడు నాకు షార్ట్, స్కర్ట్ ఇచ్చాడు. నువ్వు ధరించాలి, అది నీకు గ్లామర్‌గా ఉంటుంది అని చెప్పాడు. ఇప్పటి వరకు హోమ్లీ క్యారెక్టర్లు చేశావు. ఇది కూడా ట్రై చెయ్యి అన్నాడు. నేను అంగీకరించి పొట్టి స్కర్ట్ వేసుకున్నాను. అయితే నేను గ్లామర్‌గా కనిపించడం లేదని, బొమ్మలా కనిపిస్తానని చెప్పాడు. నువ్వు వేసుకోమని అడిగినందుకే పొట్టి స్కర్ట్ వేసుకున్నానని కూడా చెప్పాను. కానీ అలాంటి పాత్రలు చేయడం నాకు ఇష్టం లేదని చెప్పాను. ప్రస్తుతం కొంతమంది గ్లామర్ పాత్రలు పోషిస్తున్నారు. అది వారి ఇష్టం. ప్రతి ఒక్కరికి బలాలు, బలహీనతలు ఉంటాయి’’ అని చెప్పుకొచ్చింది.

Next Story