- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
డ్రాగన్ కోసం ‘ప్రస్థానం’ దర్శకుడు… హైప్ డబుల్ కావాల్సిందే
2027 జూన్ 11న విడుదల చేయాలనే లక్ష్యంతో దేవా కట్టాను టీమ్‌లోకి తీసుకున్నారని సమాచారం.

దిశ, వెబ్ డెస్క్: జూనియర్ ఎన్టీఆర్ హీరోగా, ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందుతున్న భారీ చిత్రం ప్రస్తుతం టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ సినిమాకు అధికారికంగా టైటిల్ ప్రకటించకపోయినా, ‘డ్రాగన్’ అనే పేరును ఖరారు చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. తాజాగా ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన ఒక ఆసక్తికరమైన వార్త సినీ వర్గాల్లో వైరల్ అవుతోంది. ప్రశాంత్ నీల్‌తో పాటు ‘ప్రస్థానం’ ఫేమ్ దేవా కట్టా కూడా ఈ చిత్రానికి పనిచేయనున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాని 2027 జూన్ 11న విడుదల చేయాలనే లక్ష్యంతో దేవా కట్టాను టీమ్‌లోకి తీసుకున్నారని సమాచారం. ఈ చిత్రంలో పవర్‌ఫుల్ డైలాగ్స్‌తో పాటు కీలక యాక్షన్ సన్నివేశాల రూపకల్పనలో దేవా కట్టా కీలక పాత్ర పోషించనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే తన సినిమాలతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఆయన ఈ ప్రాజెక్ట్‌లో భాగమవ్వడం వల్ల సినిమాపై అంచనాలు మరింత పెరిగే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇక ఈ చిత్రంలో రుక్మిణి వసంత్ హీరోయిన్‌గా నటించనుండగా, రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.






