హీరోయిన్‌ను పెళ్లి చేసుకున్న ‘కలర్ ఫోటో’ డైరెక్టర్.. రిసెప్షన్‌కు హాజరైన మెగా డాటర్(ఫొటోలు)

by I. Sairam |

‘కలర్ ఫోటో’ సినిమాతో డైరెక్టర్‌గా పరిచయమై తన ఫస్ట్ మూవీతోనే జాతీయ పురస్కారం అందుకున్న డైరెక్టర్ సందీప్ రాజ్ గురించి స్పెషల్‌గా చెప్పనక్కర్లేదు.

హీరోయిన్‌ను పెళ్లి చేసుకున్న ‘కలర్ ఫోటో’ డైరెక్టర్.. రిసెప్షన్‌కు హాజరైన మెగా డాటర్(ఫొటోలు)
X

దిశ, సినిమా: ‘కలర్ ఫోటో’ సినిమాతో డైరెక్టర్‌గా పరిచయమై తన ఫస్ట్ మూవీతోనే జాతీయ పురస్కారం అందుకున్న డైరెక్టర్ సందీప్ రాజ్ గురించి స్పెషల్‌గా చెప్పనక్కర్లేదు. ఈయన కెరీర్ స్టార్టింగ్‌లో పలు షార్ట్ ఫిల్మ్స్‌లో నటుడిగా అలరించాడు. అలాగే దర్శకుడిగా ఎన్నో మంచి షార్ట్ ఫిల్మ్స్ చేశాడు. ఇలా షార్ట్ ఫిల్మ్‌లకు డైరెక్టర్‌గా ఉన్న సందీప్.. సుహాస్‌ హీరోగా రూపొందిన ‘కలర్‌ ఫొటో’ చిత్రంతో సూపర్ సక్సెస్ అందుకున్నాడు. అంతేకాదు ఈయన ఒక సినిమాలో విలన్‌గా కూడా నటించాడు. అయితే సందీప్ రాజ్ ఇటీవల వివాహ బంధంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. అయితే సందీప్‌ పెళ్లి చేసుకున్న అమ్మాయి ఎవరో కాదు. పలు సినిమాల్లో హీరోయిన్‌గా నటించిన చాందినీ రావు. షార్ట్ ఫిల్మ్స్, వెబ్ సిరీస్‌లు చేస్తున్న టైం నుంచే వీరిద్దరి మధ్య పరిచయం ఉన్నట్టు తెలుస్తుంది.

వీరి పాత పోస్టుల్లో సందీప్ రాజ్, సుహాస్, షార్ట్ ఫిల్మ్ బృందం ఇలా అంతా కలిసే ఉన్నారు. గత కొన్నేళ్లుగా వీరిద్దరూ ప్రేమంచుకున్నట్లు తెలుస్తుంది. అయితే రీసెంట్‌గా వీరు తిరుపతిలో పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ఇక ఈ వేడుకకు కుటుంబ సభ్యులతో పాటు సన్నిహితులు, సినీ ఇండస్ట్రీకి చెందిన పలువురు హాజరయ్యారు. ఈ క్రమంలో వీరి రిసెప్షన్ ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. సందీప్ రాజ్- చాందిని రావు రిసెప్షన్ వేడుక మంగళవారం రాత్రి హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. ఇక ఈ వేడుకకు మెగా డాటర్ నిహారిక పాల్గొన్నట్లు తెలుస్తుంది. అందుకు సంబంధించిన పిక్స్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

Next Story