ఆ డైరెక్టర్ నన్ను అక్కడికి రమ్మన్నాడు.. నాకు చాలా భయమేసింది.. శ్రీదేవి సెన్సేషనల్ కామెంట్స్

by I. Sairam |   (  Updated:2025-06-14 11:21:42  IST  )

సాధారణంగా కొంతమంది హీరోయిన్స్ ఇండస్ట్రీలో ఒకే ఒక్క సినిమాతోనే ఫుల్ ఫేమస్ అయిపోతారు.

ఆ డైరెక్టర్ నన్ను అక్కడికి రమ్మన్నాడు.. నాకు చాలా భయమేసింది.. శ్రీదేవి సెన్సేషనల్ కామెంట్స్
X

దిశ, వెబ్‌డెస్క్: సాధారణంగా కొంతమంది హీరోయిన్స్ ఇండస్ట్రీలో ఒకే ఒక్క సినిమాతోనే ఫుల్ ఫేమస్ అయిపోతారు. తన ఫస్ట్ మూవీతోనే మంచి పాపులారిటీ సంపాదించుకుని స్టార్ క్రేజ్ తెచ్చుకుంటారు. అలా ఫేమ్ అయిన వారిలో హీరోయిన్ శ్రీదేవి(Sridevi) ఒకరు. నేచురల్ స్టార్ నాని(Nani) నిర్మాతగా తెరకెక్కించిన ‘కోర్టు’(Court) మూవీతో ఈ ముద్దుగుమ్మ ప్రేక్షకులకు పరిచయం అయింది. రామ్ జగదీష్(Ram Jagadeesh) దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ప్రియదర్శి పులికొండ(Priyadarshi Pulikonda), హర్ష్ రోషన్‌లు ప్రధాన పాత్రలో నటించారు.

అయితే తొలి సినిమా అయినప్పటికీ ఈ చిన్నది.. తన నటనతో ప్రేక్షకులను ఫిదా చేసింది. ఈ క్రమంలో ఈ అమ్మడు చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ చిన్నది ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. ఆమె మాట్లాడుతూ.. ‘ఓ బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ నాకు ఒక కవర్ సాంగ్ పాడటానికి ఆఫర్ ఇచ్చాడు. అయితే ఆ కవర్ సాంగ్ తనతో కలిసి పాడాలని.. అందుకోసం ముంబై రావాలి అని చెప్పాడు. దీంతో నేను బాగా భయపడి ముంబై వెళ్ళలేదు’ అని చెప్పుకొచ్చింది శ్రీదేవి. ప్రస్తుతం ఆమె చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.

Next Story