Radhikaa : ఇప్పుడొస్తున్న కొత్త దర్శకులు చేస్తున్న ఆ తప్పుని వరలక్ష్మి అస్సలు చేయలేదు

by Pulgam srinivas |

రాధిక మాట్లాడుతూ... ఇప్పుడొస్తున్న కొత్త దర్శకులు ఒకే సన్నివేశాన్ని అనేక రకాలుగా చిత్రీకరిస్తున్నారు. అలా ఎందుకు చేస్తున్నారో నాకు తెలియదు. కానీ వరలక్ష్మి మాత్రం ఎప్పుడూ అలా చేయలేదు అని ఈమె చెప్పుకొచ్చింది.

Radhikaa : ఇప్పుడొస్తున్న కొత్త దర్శకులు చేస్తున్న ఆ తప్పుని వరలక్ష్మి అస్సలు చేయలేదు
X

దిశ, వెబ్ డెస్క్ : సీనియర్ హీరోయిన్ రాధిక గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈమె తెలుగు, తమిళ భాషల్లో ఎన్నో సినిమాల్లో నటించి స్టార్ హీరోయిన్గా చాలా ఏళ్లు కెరీర్ను కొనసాగించింది. ప్రస్తుతం ఈ నటి చాలా సినిమాల్లో నటిస్తోంది. రాధిక కూతురు అయిన వరలక్ష్మి శరత్ కుమార్ తాజాగా 'సరస్వతి' అనే చిత్రంలో ప్రధాన పాత్రలో నటించింది. అలాగే ఆ సినిమాకు దర్శకత్వం వహించి నిర్మాతగా కూడా వ్యవహరించింది. ఇందులో రాధిక ఓ కీలకమైన పాత్రలో నటించింది.

ఈ చిత్రాన్ని మార్చి 6వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో రాధిక, శరత్ కుమార్, వరలక్ష్మి ముగ్గురు కలిసి ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. అందులో భాగంగా శరత్ కుమార్, రాధికను "నువ్వు ఇప్పటివరకు నీ సినీ ప్రస్థానంలో 300 నుండి దాదాపు 400 సినిమాల వరకు చేసి ఉంటావు. అందులో ఒక 300 మంది దర్శకులతో పని చేసి ఉంటావు. మొదటిసారి నీకు వరలక్ష్మి దర్శకత్వం చేయడం చూసి ఎలా అనిపించింది?" అని ప్రశ్నించాడు. దానికి రాధిక... "నాకు ఎందుకో తెలియదు, కానీ ఇప్పుడు వస్తున్న కొత్త దర్శకులు ఒకే షాట్ ని అనేక యాంగిల్స్ లో షూట్ చేస్తున్నారు.

పక్క నుంచి, కింది నుంచి, పై నుంచి, ఇలా రకరకాలుగా షూట్ చేస్తున్నారు. కానీ వరలక్ష్మి ఎప్పుడూ కూడా అలా చేయలేదు. తనకు ఏది కావాలో అదే యాంగిల్ లో పర్ఫెక్ట్ షాట్ సెట్ చేసుకొని షూట్ కంప్లీట్ చేసింది. అది తనలో నాకు బాగా నచ్చింది" అని రాధిక సమాధానం చెప్పింది. ఈ సినిమా సస్పెన్స్ థ్రిల్లర్ జోనర్లో రూపొందింది. ఇందులో ప్రియమణి, ప్రకాష్ రాజ్, నాజర్ తదితరులు ముఖ్య పాత్రల్లో నటించారు. వరలక్ష్మి శరత్ కుమార్, పూజా శరత్ కుమార్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు.

Next Story