హైదరాబాద్‌లో 'పాపం ప్రతాప్' ప్రీమియర్ షోల వివరాలివే?

by Pulgam srinivas |

'పాపం ప్రతాప్' ప్రీమియర్ షోలను హైదరాబాద్‌లోని పలు ముఖ్య థియేటర్లలో ప్రదర్శించనున్నారు.

హైదరాబాద్‌లో పాపం ప్రతాప్ ప్రీమియర్ షోల వివరాలివే?
X

దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ టాలెంటెడ్ నటుడు తిరువీర్ తాజాగా హీరోగా నటించిన చిత్రం ‘పాపం ప్రతాప్’. ఈ సినిమాను రేపు ప్రేక్షకుల ముందుకు తీసుకురానుండగా, విడుదలకు ముందురోజు అయిన ఈరోజు హైదరాబాద్ నగరంలో భారీ ఎత్తున ప్రీమియర్ షోలను నిర్వహించేందుకు చిత్రబృందం సిద్ధమైంది. తాజాగా ఈ ప్రీమియర్ షోలకు సంబంధించిన అధికారిక వివరాలను మేకర్స్ విడుదల చేశారు. ప్రేక్షకుల్లో ఇప్పటికే మంచి ఆసక్తిని రేకెత్తిస్తున్న ఈ చిత్రం ప్రీమియర్ షోలు నేడు హైదరాబాద్ నగరంలోని పలు ప్రముఖ థియేటర్లలో ప్రదర్శించనున్నారు. ఇప్పటికే ఈ ప్రీమియర్ షోల టికెట్ బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. చిత్రబృందం వెల్లడించిన వివరాల ప్రకారం... మైత్రి విమల్ 70 ఎంఎం (బాలానగర్) లో సాయంత్రం 7:45 గంటలకు, పీవీఆర్ నెక్సస్ (కూకట్‌పల్లి) లో 7:40 గంటలకు, పీవీఆర్ ఆర్కే సినీప్లెక్స్ (బంజారా హిల్స్) లో 7:55 గంటలకు, అలాగే ఏఎంబీ సినిమాస్ (గచ్చిబౌలి) లో రాత్రి 10:15 గంటలకు ప్రీమియర్ షోలు ప్రదర్శించనున్నారు. ఇక ఈ సినిమాలో పాయల్ రాధాకృష్ణ హీరోయిన్‌గా నటించగా, ఎస్పీ దుర్గా నరేష్ దర్శకత్వం వహించారు.




Next Story