The Conjuring: Lost Rites: రిలీజ్‌కు సిద్ధమైన ది కంజురింగ్ లాస్ట్ రైట్స్.. భయంకరంగా ఆకట్టుకుంటున్న పోస్టర్

by Chukka Sudharani |   (  Updated:2025-08-14 15:32:15  IST  )

దర్శకుడు మైఖేల్ చావెస్ (Michael Chavez) తెరకెక్కించిన అమెరికన్ చిత్రం ‘ది కంజురింగ్’.

The Conjuring: Lost Rites: రిలీజ్‌కు సిద్ధమైన ది కంజురింగ్ లాస్ట్ రైట్స్.. భయంకరంగా ఆకట్టుకుంటున్న పోస్టర్
X

దిశ, సినిమా: దర్శకుడు మైఖేల్ చావెస్ (Michael Chavez) తెరకెక్కించిన అమెరికన్ చిత్రం ‘ది కంజురింగ్’. లాస్ట్ రైట్స్ అనే ట్యాగ్ లైన్‌తో రాబోతున్న ఈ మూవీని జేమ్స్ వాన్, పీటర్ సఫ్రాన్ నిర్మించారు. వెరా ఫార్మిగా, పాట్రిక్ విల్సన్, మియా టాంలిన్సన్, బెన్ హార్డీ తదితరులు ప్రధాన పాత్రల్లో నటించిన ఈ మూవీకి సంబంధించిన రిలీజ్ డేట్‌ను ప్రకటించారు చిత్ర బృందం. హారర్ బ్యాక్ డ్రాప్‌లో తెరకెక్కుతోన్న ఈ చిత్రం సెప్టెంబర్ 5న ఇంగ్లీష్, హిందీ, తమిళం అండ్ తెలుగు భాషల్లో రిలీజ్ కాబోతున్నట్లు తెలుపుతూ.. ‘చివరి అధ్యాయం ప్రారంభం కానుంది.. ‘ది కంజురింగ్: లాస్ట్ రైట్స్’ సెప్టెంబర్ 5న సినిమాహాళ్లలో మాత్రమే.. ఇంగ్లీష్, హిందీ, తమిళం & తెలుగు భాషలలో.. IMAXలో కూడా’ అంటూ ఓ పోస్టర్ రిలీజ్ చేశారు. భయంకరంగా ఆకట్టుంటున్న ఈ పోస్టర్ సినిమాపై ప్రేక్షకుల్లో అంచనాలను పెంచుతున్నది. లింక్

Next Story