- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఇండస్ట్రీ పరిస్థితి దారుణం.. 45 కోట్ల నుంచి 20 కోట్లకు పడిపోయింది.. షాకింగ్ కామెంట్స్ చేసిన మైత్రి చెర్రీ
మైత్రి మూవీ మేకర్స్ సీఈఓ చెర్రీ మాట్లాడుతూ... 'పుష్ప 2' మ్యూజిక్ హక్కులు 45 కోట్లకు అమ్ముడుపోయాయని, కానీ ప్రస్తుతం అదే స్థాయి సినిమాలకు కూడా మ్యూజిక్ హక్కుల డీల్స్ సుమారు 20 కోట్లలోనే ముగుస్తున్నాయని ఆయన పేర్కొన్నారు.

దిశ, వెబ్ డెస్క్: తాజాగా మైత్రి మూవీ మేకర్స్ సీఈవో చెర్రీ ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. అందులో భాగంగా ఆయన ప్రస్తుత ఇండస్ట్రీ పరిస్థితిపై స్పందించారు. ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం పెద్ద ఎత్తున వైరల్‌గా మారాయి. చెర్రీ మాట్లాడుతూ… ప్రస్తుతం ఇండస్ట్రీ పరిస్థితి అంతగా అనుకూలంగా లేదని తెలిపారు. రెండు సంవత్సరాల క్రితం అల్లు అర్జున్ హీరోగా రూపొందిన పుష్ప: ది రూల్ చిత్రం విడుదలైన విషయం తెలిసిందే. ఆ సినిమా మ్యూజికల్ హక్కులు ఏకంగా 45 కోట్లకు అమ్ముడయ్యాయి.
ఆ లెక్కన చూస్తే, ఇప్పుడు అదే స్థాయి క్రేజ్ ఉన్న సినిమాలకు, ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్లు సంగీతం అందించిన చిత్రాలకు ఇంకా ఎక్కువ డీల్స్ జరగాలి. కానీ ప్రస్తుతం అంత పెద్ద స్థాయిలో డీల్స్ జరగడం లేదని ఆయన చెప్పారు. ఏ.ఆర్. రెహమాన్, అనిరుద్ రవిచందర్ వంటి టాప్ మ్యూజిక్ డైరెక్టర్లు పనిచేసిన స్టార్ హీరోల సినిమాలకు కూడా మ్యూజిక్ హక్కుల ద్వారా సుమారు 20 కోట్ల పరిధిలోనే ఆదాయం వస్తోందని వెల్లడించారు. ఇలా ప్రస్తుతం మ్యూజిక్ హక్కుల ద్వారా వచ్చే ఆదాయం గణనీయంగా తగ్గిందని ఆయన పేర్కొన్నారు. అలాగే మరికొన్ని విషయాల్లో కూడా ఇండస్ట్రీ కొన్ని ఇబ్బందులను ఎదుర్కొంటోందని స్పష్టం చేశారు. చెర్రీ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి.






