- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆ సంస్థ చేతికి ‘నాగబంధం’ నార్త్ ఇండియా డిస్ట్రిబ్యూషన్ రైట్స్
‘నాగబంధం’ మూవీ నార్త్ ఇండియా థియేటర్ హక్కులను జీ స్టూడియోస్ దక్కించుకుంది.

దిశ, వెబ్ డెస్క్: యువ నటుడు విరాట్ కర్ణ హీరోగా తెరకెక్కుతున్న ‘నాగబంధం’ చిత్రంపై ప్రేక్షకుల్లో ఆసక్తి రోజురోజుకీ పెరుగుతోంది. ఈ సినిమాలో నభా నటేష్, ఐశ్వర్య మీనన్ హీరోయిన్లుగా నటిస్తుండగా, అభిషేక్ నామ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని జూలై 3న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ప్రచార చిత్రాలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకోవడంతో మూవీపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ముఖ్యంగా విజువల్స్, కథా నేపథ్యం ఆసక్తిని రేకెత్తించడంతో సినీ వర్గాల్లో కూడా ఈ ప్రాజెక్ట్‌పై పాజిటివ్ బజ్ నెలకొంది.
ఈ క్రమంలోనే చిత్రానికి థియేట్రికల్ బిజినెస్ కూడా మంచి స్థాయిలో జరుగుతున్నట్లు సమాచారం. తాజాగా ‘నాగబంధం’ చిత్రానికి సంబంధించిన నార్త్ ఇండియా థియేట్రికల్ హక్కులు సెల్ అయ్యాయి. ప్రముఖ నిర్మాణ, పంపిణీ సంస్థ జీ స్టూడియోస్ ఈ మూవీ నార్త్ ఇండియా థియేటర్ హక్కులను సొంతం చేసుకుంది. అంతేకాకుండా అన్ని భాషల్లోనూ ఈ చిత్రాన్ని ఇదే సంస్థ ప్రజెంట్ చేయబోతుంది. ఇక కిషోర్ అన్నపురెడ్డి, నిషిత నాగిరెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో అనసూయ, మురళీ శర్మ, జగపతిబాబు, జయప్రకాశ్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ప్రస్తుతం ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి ఆసక్తి నెలకొంది.






