సెట్‌లోనే రాజమౌళిని తీవ్రంగా అవమానించిన క్యారెక్టర్ ఆర్టిస్ట్..?

by Disha Web Desk 6 |
సెట్‌లోనే రాజమౌళిని తీవ్రంగా అవమానించిన క్యారెక్టర్ ఆర్టిస్ట్..?
X

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ స్టార్ డైరెక్టర్లలో రాజమౌళి ఒకరు. ఆయన తెరకెక్కించిన చిత్రాలు చాలా వరకు అవార్డులు సాధించాయి. నాని ఈగ, బాహుబలి ఇలా ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్స్ అందించారు. ఇటీవల రాజమౌళి డైరెక్షన్‌లో వచ్చిన ఆర్ఆర్ఆర్ చిత్రానికి ఏకంగా నేషనల్ అవార్డ్ వచ్చింది. అయితే రాజమౌళిని ఒకానొక సమయంలో ఓ క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఆయనను అవమానించినట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. సింహాద్రి సినిమా టైంలో ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ రాజమౌళిని తీవ్రంగా విమర్శించారు. ఆయనకు సంబంధించిన ఓ షూట్ జరుగుతుండగా.. రాజమౌళి చాలా టేకులు తీయించారట.

ఎంత మంచిగ చేసినా ఓకే చెప్పలేదట. దీంతో ఆ క్యారెక్టర్ ఆర్టిస్ట్‌కి కోపం వచ్చి ‘‘నీలాంటి డైరెక్టర్లను చాలా మందిని చూశాను. చాలా పెద్ద డైరెక్టర్ దగ్గరే పని చేశాను. ఇప్పటి వరకు ఒకటి రెండు టేకుల్లోనే ఓకే చేసేది. నువ్వు మాత్రం 20 టేకులు చేయించావు అంటూ నోటికొచ్చింది మాట్లాడట. దీనికి రాజమౌళి అతనిని ఏం అనకుండా చిన్న నవ్వు నవ్వి మళ్లీ చేయమని చెప్పాడట. అయితే అలా తిట్టిన ఆర్టిస్ట్ ఎవరో తెలియలేదు. అలా రాజమౌళి ఎంతమంది విమర్శించిన కూడా తన స్టైల్ ఆఫ్ మేకింగ్ ఎక్కడ కూడా తగ్గించుకోకుండా సినిమాలు చేస్తూ తన పర్ఫెక్షన్ ని చూపిస్తూ వస్తున్నాడు. ఇందులో భాగంగా ఆయన చేసిన ప్రతి సినిమా కూడా సూపర్ డూపర్ హిట్ అవడంతో ప్రస్తుతం పాన్ ఇండియా రేంజ్ లో స్టార్ డైరెక్టర్‌గా గుర్తింపు పొందుతున్నాడు.

Next Story

Most Viewed