- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సస్పెన్స్, క్రైమ్ జోనర్‌లో ‘ది బ్రెయిన్’.. డైరెక్టర్ ఏం అన్నాడంటే
సస్పెన్స్, క్రైమ్ జోనర్‌లో వచ్చే చిత్రాలకు ఆడియెన్స్ ఎప్పుడు కనెక్ట్ అవుతారు.

దిశ, సినిమా: సస్పెన్స్, క్రైమ్ జోనర్‌లో వచ్చే చిత్రాలకు ఆడియెన్స్ ఎప్పుడు కనెక్ట్ అవుతారు. ఈ క్రమంలో ఎండ్లూరి ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై ఎండ్లూరి కళావతి నిర్మిస్తున్న సస్పెన్స్, క్రైమ్ చిత్రం ‘ది బ్రెయిన్’. అశ్విన్ కామరాజ్ కొప్పాల దర్శకత్వంలో రాబోతున్న ఈ చిత్రంలో అజయ్, తన్విక, బేబీ దాన్విత, అజయ్ ఘోష్, శరత్ లోహిత్, జయ చంద్ర నాయుడు, రవి కాలే, జ్యోతి తదితరులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ చిత్తూరు జిల్లా పరిసర ప్రాంతాలలో శరవేగంగా జరుగుతోంది. ఇందులో భాగంగానే దర్శకుడు అశ్విన్ కామరాజ్ కొప్పాల మాట్లాడుతూ .. ‘ది బ్రెయిన్’ చిత్రాన్ని క్రైమ్ అండ్ సస్పెన్స్ జానర్‌లో తెరకెక్కిస్తున్నాం. ప్రస్తుత సమాజంలో జరుగుతున్న పరిణామాలను దృష్టిలో పెట్టుకుని ఈ మూవీని తీస్తున్నాం. ఈ చిత్రానికి మాటలు పోతు గడ్డం ఉమా శంకర్ అందించారు. యూఎస్ విజయ్ కెమెరామెన్‌గా, ఎంఎల్ రాజా మ్యూజిక్ డైరెక్టర్‌గా మంచి అవుట్ పుట్ అందిస్తున్నారు’ అని అన్నారు. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన అన్ని కార్యక్రమాల్ని పూర్తి చేసుకుని విడుదల తేదీని ప్రకటించనున్నామని తెలిపారు.






