ఆ హీరోతో ఎంగేజ్‌మెంట్ చేసుకున్న బ్రహ్మముడి యాక్టర్.. ఎన్నో స్ట్రగుల్స్ తర్వాత అంటూ పోస్ట్.. కంగ్రాట్స్ చెబుతున్న నెటిజన్స్

by Gugulothu.Kavitha |

'బ్రహ్మముడి'(Brahmamud) సీరియల్ ద్వారా తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి నైనిషా రాయ్(Nainisha Rai) గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు.

ఆ హీరోతో ఎంగేజ్‌మెంట్ చేసుకున్న బ్రహ్మముడి యాక్టర్.. ఎన్నో స్ట్రగుల్స్ తర్వాత అంటూ పోస్ట్.. కంగ్రాట్స్ చెబుతున్న నెటిజన్స్
X

దిశ, వెబ్‌డెస్క్: 'బ్రహ్మముడి'(Brahmamud) సీరియల్ ద్వారా తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి నైనిషా రాయ్(Nainisha Rai) గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు. ఈ చిన్నది ఈ ధారావాహికలో అప్పు(Appu) పాత్రలో అందరినీ ఫిదా చేస్తుంది. సీరియల్ మొదట్లో బాయ్ కట్‌లో రౌడీ బేబీలా కనిపించిన నైనిష.. ఇప్పుడు పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా అందరీ బెండు తీస్తుంది. అలాగే ఈ సిరియల్‌తో పాటు మరికొన్ని సీరియల్స్ అండ్ టీవీ షోల్లో పాల్గొంటూ బిజీబిజీగా ఉంటుంది ఈ బ్యూటీ. ఇదిలా ఉంటే.. తాజాగా నైనిష తన ఫ్యాన్స్‌కి సర్‌ప్రైజ్ ఇస్తూ నిశ్చితార్థం ఫొటోలు షేర్ చేసింది. తన ప్రియుడితో ఎంగేజ్‌మెంట్(Engagement) అయిన పిక్స్‌ను షేర్ చేస్తూ "మొత్తానికి మేము సాధించాం.. చాలా ఇబ్బందులు ఎదుర్కొన్న తర్వాత మా రోజు వచ్చింది.

నాకు సపోర్ట్ సిస్టమ్‌గా ఉన్నందుకు థాంక్యూ ఆశిష్ చక్రవర్తి" అంటూ నైనిషా రాసుకొచ్చింది. దీంతో ఈ పోస్ట్ కాస్త నెట్టింట వైరల్‌గా మారాయి. ఇక వాటిని చూసిన నెటిజన్లు, ఫ్యాన్స్ రీల్ నిశ్చితార్థమా, రియల్ ఎంగేజ్‌మెంటా అని కంగ్రాట్స్ అని, నైనిషాకి కాబోయేవాడు అదిరిపోయాడంటూ కామెంట్లు పెడుతున్నారు. కాగా అప్పుకి కాబోయే వరుడి పేరు ఆశిష్ చక్రవర్తి(Ashish Chakravarthi). అతను ఓ సీరియల్ హీరో. జీ తెలుగులో ప్రసారమవుతున్న 'చామంతి' సీరియల్‌లో హీరో ప్రేమ్‌గా నటిస్తున్నాడు. తెలుగుతో పాటు తమిళ్‌లో కూడా అతను పలు సీరియల్స్ చేశాడు.

Link

Next Story