ఆ అవతారంలో ఉన్న ఫొటోలు షేర్ చేసిన బోల్డ్ బ్యూటీ.. ఛీ చండాలంగా ఉన్నావంటూ పొట్టు పొట్టుగా తిట్టిపోస్తున్న నెటిజన్లు

by Gugulothu.Kavitha |   (  Updated:2025-06-14 14:16:58  IST  )

‘కుమారి 21 ఎఫ్’ (Kumari 21F)సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన బోల్డ్ బ్యూటీ హెబ్బా పటేల్(Hebah Patel) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

ఆ అవతారంలో ఉన్న ఫొటోలు షేర్ చేసిన బోల్డ్ బ్యూటీ.. ఛీ చండాలంగా ఉన్నావంటూ పొట్టు పొట్టుగా తిట్టిపోస్తున్న నెటిజన్లు
X

దిశ, వెబ్‌డెస్క్: ‘కుమారి 21 ఎఫ్’ (Kumari 21F)సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన బోల్డ్ బ్యూటీ హెబ్బా పటేల్(Hebah Patel) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తన ఫస్ట్ మూవీతోనే ఈ భామకు ఫుల్ పాపులారిటీ వచ్చేసింది. అంతేకాకుండా ఈ చిత్రంలో ఈ ముద్దుగుమ్మదే మెయిన్ రోల్ కావడంతో పాటు సినిమా కూడా సూపర్ హిట్ విజయం సాధించింది. అలాగే తన అందం, అభినయంతో కుర్రాళ్ల క్రష్ అయిపోయింది. దీంతో ఈ భామ గ్రాఫ్ ఒక్కసారిగా చేంజ్ అయి అమాంతం స్టార్ హీరోయిన్ రేంజ్‌లోకి వెళ్లిపోతుంది అని అందరూ అనుకున్నారు.

కానీ అనుకున్నంత స్టార్ డమ్ అయితే రాలేదు. ఆఫర్లు వచ్చినా స్టార్ హీరోయిన్‌గా మాత్రం రాణించలేకపోయింది. ప్రస్తుతం భాషతో సంబంధం లేకుండా అడపాదడపా సినిమాల్లో నటిస్తూ హీరోయిన్‌గా రాణిస్తోంది. కానీ నిత్యం సోషల్ మీడియా(Social Media)లో ఫుల్ యాక్టీవ్‌గా ఉంటూ తన హాట్ హాట్ ఫొటోలతో పాటు వ్యక్తిగత విషయాలు, సినిమా విశేషాలను పంచుకుంటూ ఫ్యాన్స్‌కు దగ్గరవుతూ ఉంటుంది. ఈ క్రమంలో ఈ ముద్దుగుమ్మ పోస్ట్ నెట్టింట చక్కర్లు కొడుతోంది.

తాజాగా హెబ్బా పటేల్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో కొన్ని ఫొటోస్ షేర్ చేసింది. అందులో ‘వీకెండ్ రెడీ’ అని బ్లాక్ కళ్లజోడు పెట్టుకుని జిడ్డు మొహంతో ఉన్న ఫొటోస్ షేర్ చేసింది. అయితే ఆమె హీరోయిన్‌గా కాకుండా చాలా డిఫరెంట్‌గా కనిపించింది. దీంతో ఈ పోస్ట్ కాస్తా నెట్టింట వైరల్‌గా మారింది. ఇక దీన్ని చూసిన నెటిజన్లు ఛీ.. చండాలంగా ఉన్నావు.. మేకప్ మహిమ వల్ల ఇన్ని రోజులు నిన్ను చూశాము అని, ఒక్కసారిగా నిన్ను దగ్గర నుంచి చూసి భయపడ్డాము అని, షాక్ అవుతున్న ఎమోజీలను షేర్ చేస్తున్నారు.

Hebah patel Instagram post

Next Story