పోలీస్ ఆఫీసర్‌గా సంయుక్తా మీనన్

by Sujitha Rachapalli |

అద్భుతమైన నటనతో ఆకట్టుకునే సంయుక్త పాన్-ఇండియన్ యాక్షన్ డ్రామా ‘ది బ్లాక్ గోల్డ్’లో ప్రధాన పాత్ర పోషిస్తుంది. యోగేష్ కెఎంసి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని మాగంటి పిక్చర్స్ భాగస్వామ్యంతో హాస్య మూవీస్ బ్యానర్‌పై రాజేష్ దండా నిర్మిస్తున్నారు.

పోలీస్ ఆఫీసర్‌గా సంయుక్తా మీనన్
X

దిశ, సినిమా : అద్భుతమైన నటనతో ఆకట్టుకునే సంయుక్త పాన్-ఇండియన్ యాక్షన్ డ్రామా ‘ది బ్లాక్ గోల్డ్’లో ప్రధాన పాత్ర పోషిస్తుంది. యోగేష్ కెఎంసి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని మాగంటి పిక్చర్స్ భాగస్వామ్యంతో హాస్య మూవీస్ బ్యానర్‌పై రాజేష్ దండా నిర్మిస్తున్నారు. పవర్ ఫుల్ కమర్షియల్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ చిత్రంలో సంయుక్త ఇంటెన్స్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనుంది. చిత్ర బృందం నూతన సంవత్సరం సందర్భంగా విడుదల చేసిన ప్రత్యేక పోస్టర్‌ సినిమాపై అంచనాలను మరింత పెంచింది. ‘కె-రాంప్’ తర్వాత రాజేష్ దండా నిర్మిస్తున్న భారీ స్థాయి యాక్షన్ డ్రామా ‘ది బ్లాక్ గోల్డ్’.. ఇప్పటికే ట్రేడ్ వర్గాలలో, సినీ ప్రేక్షకులలో బలమైన బజ్‌ను క్రియేట్ చేసింది. చిత్రీకరణ దాదాపు పూర్తి అయిందని.. కేవలం 15 రోజుల షూటింగ్ మాత్రమే మిగిలి ఉందని తెలిపిన మేకర్స్... పోస్ట్-ప్రొడక్షన్ పనులు కూడా ఏకకాలంలో జరుగుతున్నాయని తెలిపారు. సామ్ సిఎస్ సంగీతం అందిస్తున్న సినిమాను తెలుగు, హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషలలో ఏకకాలంలో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.

Next Story