THE BLACK GOLD: నెవ్వర్ బిఫోర్ పాత్రలో సంయుక్త ..ఫస్ట్ లక్ అదిరిందిగా!

by Ajay Maddhiboyina |

సౌత్ బ్యూటీ సంయుక్తా మీనన్ నటిస్తున్న తాజా చిత్రం ది బ్లాక్ గోల్డ్. ఆదివారం సినిమా టైటిల్‌ను మేకర్స్ అనౌన్స్ చేశారు. లేడీ ఓరియెంటెడ్ సినిమాగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. హాస్య మూవీస్, మాగంటి పిక్చ‌ర్స్ బ్యాన‌ర్స్ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తుండ‌గా యోగేష్ కేఎంసీ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు.

THE BLACK GOLD: నెవ్వర్ బిఫోర్ పాత్రలో సంయుక్త ..ఫస్ట్ లక్ అదిరిందిగా!
X

దిశ, వెబ్ డెస్క్: సౌత్ బ్యూటీ సంయుక్తా మీనన్ నటిస్తున్న తాజా చిత్రం ది బ్లాక్ గోల్డ్. ఆదివారం సినిమా టైటిల్‌ను మేకర్స్ అనౌన్స్ చేశారు. లేడీ ఓరియెంటెడ్ సినిమాగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. హాస్య మూవీస్, మాగంటి పిక్చ‌ర్స్ బ్యాన‌ర్స్ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తుండ‌గా యోగేష్ కేఎంసీ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఈ చిత్రంలో సంయుక్త ప‌వ‌ర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్ర‌లో న‌టిస్తోంది. అంతే కాకుండా దీనిని ఈ పాన్ ఇండియా లెవ‌ల్‌లో తెర‌కెక్కిస్తున్నారు. తెలుగుతో పాటు హిందీ, త‌మిళ‌, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ భాషల్లో చిత్రీకరిస్తున్నారు.

ఇక‌ దీపావ‌ళి సంద‌ర్భంగా ఈ చిత్రాన్ని చిత్ర‌యూనిట్ సినిమా ఫస్ట్ లుక్ పోస్ట‌ర్ ను విడుద‌ల చేసింది. పోస్టర్‌లో సంయుక్త రగ్డ్ లుక్‌తో కనిపిస్తున్నారు. దీంతో ఈ సినిమా పక్కా యాక్షన్ ఎంటర్టైనర్ లా కనిపిస్తోంది. అంతేకాకుంబా అర్బన్ బ్యాక్ డ్రాప్‌లో ఈ సినిమా ఉండబోతున్నట్టు తెలుస్తోంది. దీంతో ఇది వరకు గ్లామర్‌తో మెప్పించిన మలయాళ బ్యూటీ ఈ సారి యాక్షన్ తో అదరగొట్టబోతుందని అర్థం అర్థం అవుతోంది. ఇక ప్రస్తుతం సినిమా షూటింగ్ హైదరాబాద్ లో శరవేగంగా జరుగుతుండగా విడుదల తరవాత ఏ మేరకు ఆకట్టుకుంటుందో చూడాలి.

Next Story