- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ‘ది బ్లాక్ గోల్డ్’
‘ది బ్లాక్ గోల్డ్’ సినిమాకు సంబంధించిన ఆఖరి షెడ్యూల్ తాజాగా పూర్తయినట్లు మూవీ యూనిట్ ప్రకటించింది.

దిశ, వెబ్ డెస్క్: మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ టాలెంటెడ్ నటి సంయుక్త మీనన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘ది బ్లాక్ గోల్డ్’. యోగేష్ KMC దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను హాస్య మూవీస్ బ్యానర్‌పై రాజేష్ దండా నిర్మిస్తున్నారు. సామ్ CS ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాలో సంయుక్త మీనన్ పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతోంది. తాజాగా ఈ మూవీ బృందం సినిమాకు సంబంధించిన ఒక క్రేజీ అప్డేట్‌ను అధికారికంగా ప్రకటించింది. ఈ సినిమాకు సంబంధించిన ఆఖరి షెడ్యూల్ తాజాగా పూర్తి అయినట్లు మూవీ యూనిట్ ప్రకటించింది. ఇక ఈ సినిమాను ఈ ఏడాది సమ్మర్‌లో విడుదల చేసే ఆలోచనలో మూవీ మేకర్స్ ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ మంచి విజయం సాధించినట్లయితే సంయుక్త మీనన్‌కు అద్భుతమైన గుర్తింపు దక్కే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరి ఈ మూవీ ఏ స్థాయి విజయాన్ని సొంతం చేసుకుంటుందో చూడాలి.






