- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
'ఉస్తాద్ భగత్ సింగ్' ముందు అతి పెద్ద సవాల్.. ప్రభాస్ చేసిన తప్పు చేస్తే అంతే
ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రం టికెట్ ధరల పెంపు విషయంలో ఎలాంటి వ్యూహాన్ని అనుసరించి ముందుకు వెళుతుందా అనేది ఆసక్తికరంగా మారింది.

దిశ, వెబ్ డెస్క్: మరికొన్ని రోజుల్లో విడుదలకు సిద్ధంగా ఉన్న భారీ చిత్రాలలో ఉస్తాద్ భగత్ సింగ్ ఒకటి. టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందిన ఈ చిత్రంలో రాశి ఖన్నా, శ్రీలీల హీరోయిన్లుగా నటించారు. హరీష్ శంకర్ దర్శకత్వం వహించారు. ఈ మూవీని మార్చి 19న విడుదల చేయనున్నారు. గత కొంతకాలంగా మన తెలుగు సినిమా పరిశ్రమకు సంబంధించిన ఏ స్టార్ హీరో సినిమా విడుదల అయినా కూడా టికెట్ ధరలను పెంచి ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు.
రెండు తెలుగు రాష్ట్రాల్లో టికెట్ ధరలను పెంచుకోవాలంటే రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు వేరువేరుగా అందుకు సంబంధించిన జీవోలను విడుదల చేయవలసి ఉంటుంది. ప్రభుత్వం నుండి అధికారికంగా జీవో విడుదల అయ్యాక మాత్రమే టికెట్ ధరలను పెంచుకొని బుకింగ్స్ ఓపెన్ చేయాల్సి ఉంటుంది. దానితో మూవీ బృందాలు టికెట్ ధరల పెంపు కోసం ప్రయత్నాలు చేస్తూ సినిమా విడుదలకు కొన్ని గంటల ముందు జీవోలను తెచ్చుకొని హడావిడిగా బుకింగ్స్ ను ఓపెన్ చేస్తున్నారు. దానితో ప్రేక్షకులు విసిగి వేసారి పోతున్నారు.
కొంతకాలం క్రితం ప్రభాస్ హీరోగా రూపొందిన రాజా సాబ్ సినిమాకు సంబంధించిన టికెట్ ధరల పెంపుకు సంబంధించిన జీవో కూడా చాలా ఆలస్యంగా వచ్చింది. దానితో ప్రభాస్ అభిమానులు, సాధారణ ప్రేక్షకులు కూడా ఈ మూవీ బృందం తీరుపై అసహనం వ్యక్తం చేశారు. ఇక ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ మూవీ విషయానికి వస్తే పవన్ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి ఉపముఖ్యమంత్రి కావడం వల్ల అక్కడ టికెట్ ధరల పెంపుకు సంబంధించిన జీవో కాస్త ముందుగానే వచ్చే అవకాశం ఉందని చాలామంది అంచనా వేస్తున్నారు. ఇక తెలంగాణ రాష్ట్రంలో జీవో ఎప్పుడు వస్తుందా అనేది ఆసక్తిగా మారింది. ఏదేమైనా కూడా టికెట్ బుకింగ్స్ మాత్రం సినిమా విడుదలకు కనీసం మూడు నుంచి నాలుగు రోజుల ముందు ఓపెన్ అయితే బాగుంటుందని చాలామంది ప్రేక్షకులు అనుకుంటున్నారు.






