AN UNFINISHED STORY అంటూ మళ్లీ జతకట్టనున్న ‘బేబీ’ పెయిర్‌.. ట్వీట్ వైరల్

by I. Sairam |   (  Updated:2025-01-15 10:36:49  IST  )

టాలీవుడ్ యంగ్ హీరో ఆనంద్ దేవ‌ర‌కొండ‌(Anandh Devarakonda), అందాల ముద్దుగుమ్మ వైష్ణవి చైతన్య‌(Vaishnavi Chaitanya)లు ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించిన ‘బేబీ’(Baby) చిత్రం ఎంతగా హిట్ అయిందో మనందరికీ తెలిసిందే.

AN UNFINISHED STORY అంటూ మళ్లీ జతకట్టనున్న ‘బేబీ’ పెయిర్‌.. ట్వీట్ వైరల్
X

దిశ, సినిమా: టాలీవుడ్ యంగ్ హీరో ఆనంద్ దేవ‌ర‌కొండ‌(Anandh Devarakonda), అందాల ముద్దుగుమ్మ వైష్ణవి చైతన్య‌(Vaishnavi Chaitanya)లు ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించిన ‘బేబీ’(Baby) చిత్రం ఎంతగా హిట్ అయిందో మనందరికీ తెలిసిందే. అయితే వీరిద్ద‌రి కాంబినేష‌న్‌లో మ‌రో చిత్రం రానుంది. ఇక #90’s (ఎ మిడిల్ క్లాస్ బయోపిక్) వెబ్ సిరీస్‌ను తెర‌కెక్కించిన ద‌ర్శ‌కుడు ఆదిత్య హాస‌న్(Adithya Hasan) డైరెక్ష‌న్‌లో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్(Sitara Entertainments) బ్యానర్‌పై ఈ మూవీని తెరకెక్కించనున్నారు. ఇక ఈ విష‌యాన్ని చిత్ర బృందం అధికారికంగా ప్ర‌క‌టిస్తూ హీరో, హీరోయిన్‌కి సంబంధించిన స్పెషల్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు.

అదే విధంగా ఈ పోస్టర్‌లో.. త‌మ నిర్మాణ సంస్థ‌లో 32వ చిత్రంగా ఈ సినిమాని తెర‌కెక్కించ‌నున్న‌ట్లు, ఇది ఓ మిడిల్ క్లాస్ ల‌వ్ స్టోరీ అని, అంద‌రిని బాగా ఆక‌ట్టుకుంటుంద‌ని, త్వ‌ర‌లోనే షూటింగ్ ప్రారంభం కానున్న‌ట్లు వెల్లడించింది. అలాగే మిగిలిన వివ‌రాల‌ను త్వ‌ర‌లోనే వెల్ల‌డించ‌నున్న‌ట్లు తెలిపింది. కాగా ప్ర‌ముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ అయిన ఈటీవీ విన్‌(ETV WIN)లో రిలీజ్ అయిన 90’s మిడిల్ క్లాస్ బయోపిక్ ఎంతగా విజయం సాధించించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రతి మిడిల్ క్లాస్ వాళ్ళకి హత్తుకునేలా ఉన్న ఈ చిత్రం ఆడియన్స్‌ను ఎంతగానో ఆకర్షించింది. దీంతో ఇప్పుడు వచ్చే ఈ సినిమా కూడా అంతే విజయం సాధిస్తుందని నెటిజన్లు అభిప్రాయ పడుతున్నారు.

Next Story