- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘నాకు ఒక్కసారిగా భయమేసింది’.. సంచలన విషయాలు వెల్లడించిన ఆటో డ్రైవర్!
బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్(Saif Ali Khan) పై దుండగుడు దాడి చేసిన ఘటన ప్రజెంట్ చర్చనీయాంశంగా మారింది.

దిశ,వెబ్‌డెస్క్: బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్(Saif Ali Khan) పై దుండగుడు దాడి చేసిన ఘటన ప్రజెంట్ చర్చనీయాంశంగా మారింది. ఈ దాడిలో సైఫ్ శరీరం పై మొత్తం ఆరు చోట్ల తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన కుటుంబ సభ్యులు ఆయనను చికిత్స నిమిత్తం లీలావతి ఆస్పత్రి(Lilavati Hospital)కి తరలించారు. అయితే కారు సిద్ధంగా లేని వేళ ఆటో డ్రైవరే సైఫ్‌ను ఆసుపత్రికి తీసుకెళ్లాడు. ఈ క్రమంలో తాజాగా ఆ ఆటో డ్రైవర్(Auto Driver) భజన్ సింగ్ రాణా(Bhajan Singh Rana) మీడియాతో మాట్లాడుతూ సంచలన విషయాలు వెల్లడించారు.
భజన్ సింగ్ రాణా మీడియాతో మాట్లాడుతూ.. ఆ రాత్రి వేళ ప్రయాణికుల కోసం చూస్తూ సైఫ్ అలీ ఖాన్ ఉండే ఏరియా వైపు వెళ్తున్న క్రమంలో సద్గురు అపార్ట్‌మెంట్ నుంచి కేకలు వినిపించాయి. వాళ్లు నన్ను రమ్మని అరుస్తున్నట్లు వినిపించింది. దీంతో నేను అక్కడికి వెళ్ళే సరికి నలుగురైదుగురు బయటికి వచ్చారు. ఒక వ్యక్తి రక్తసిక్తమైన స్థితిలో కనిపించాడు. అది చూడగానే ఒక్కసారిగా భయమేసింది. అపార్ట్మెంట్ లోపల ఏదో గొడవ జరిగి ఉంటుంది అనుకున్నా. ఇక గాయాలతో ఉన్న వ్యక్తితో పాటు మరో ఇద్దరు నా ఆటోలో ఎక్కారు.
నేను వారిని ఆ దెబ్బలు ఎలా తగిలాయని అడగలేదు. ఏ ఆసుపత్రికి తీసుకెళ్లమంటారు.. అని అడిగాను. ఈ క్రమంలో వారిని దగ్గర్లోని లీలావతి ఆస్పత్రి(Lilavati Hospital)కి వేగంగా తీసుకెళ్లాను. ఆసుపత్రికి చేరుకున్న తర్వాతే తెలిసింది. ఆ రక్తపు గాయాలతో ఉన్న వ్యక్తి బాలీవుడ్ హీరో సైఫ్ అలీ ఖాన్ అని. నేను ఆటోలో ఆయనను తీసుకుని వచ్చినప్పుడు ఆయన వెంట కరీనా కపూర్ ఖాన్ లేరు. ఆటోలో ఎక్కిన సమయంలో ఆయన ఎవరో అనుకున్నాను. ఆసుపత్రికి వచ్చాక రక్తం కారి పోతున్నప్పటికీ సైఫ్ ఎంతో నిబ్బరంగా నడిచారు. ధైర్యంగా కనిపించారని ఆటోడ్రైవర్ భజన్ సింగ్ రాణా వెల్లడించారు.






