ప్రముఖ సంస్థ చేతికి 'చెన్నై లవ్ స్టోరీ' ఆడియో హక్కులు

by Pulgam srinivas |

టీ-సిరీస్ చేతికి 'చెన్నై లవ్ స్టోరీ' ఆడియో హక్కులు

ప్రముఖ సంస్థ చేతికి చెన్నై లవ్ స్టోరీ ఆడియో హక్కులు
X

దిశ, సినిమా: టాలీవుడ్ యువ నటుడు కిరణ్ అబ్బవరం ప్రస్తుతం రవి నంబూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'చెన్నై లవ్ స్టోరీ' చిత్రంలో హీరోగా నటిస్తున్నాడు. ఈ చిత్రంలో శ్రీ గౌరీ ప్రియ హీరోయిన్గా కనిపించబోతోంది. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ శరవేగంగా కొనసాగుతుండగా, విడుదల తేదీని మాత్రం మేకర్స్ ఇప్పటివరకు అధికారికంగా ప్రకటించలేదు. ఇదిలా ఉండగా, తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఒక కీలక అప్డేట్ బయటకు వచ్చింది. ఈ మూవీకి సంబంధించిన మ్యూజిక్ హక్కులను ప్రముఖ మ్యూజిక్ సంస్థ టీ-సిరీస్ దక్కించుకుంది.

ఇండియావ్యాప్తంగా మంచి గుర్తింపు, భారీ క్రేజ్ కలిగిన ఈ సంస్థ ఈ సినిమా ఆడియో హక్కులను సొంతం చేసుకోవడంతో, 'చెన్నై లవ్ స్టోరీ' చిత్ర ఆల్బమ్‌పై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఏర్పడుతున్నాయి. ఇక ఈ చిత్రాన్ని 'బేబీ' సినిమా ఫేమ్ ఎస్.కె.ఎన్ మరియు సాయి రాజేశ్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. లవ్ స్టోరీ నేపథ్యంతో తెరకెక్కుతున్న ఈ సినిమా, యువతను ఆకట్టుకునే అంశాలతో రూపొందుతున్నట్లు సినీ వర్గాల్లో చర్చ నడుస్తోంది.

Next Story