కలెక్షన్స్‌లో సత్తా చాటుతున్న యానిమేటెడ్ సినిమా.. కేవలం 8 రోజుల్లోనే అన్ని కోట్లు కొల్లగొట్టిందిగా..

by I. Sairam |

అశ్విన్ కుమార్(Ashwin Kumar) తెరకెక్కించిన యానిమేటెడ్ చిత్రం ‘మహావతార్ నరసింహ’(Mahavatar Narasimha) గురించే ప్రెజెంట్ అంతా ఎక్కువ‌గా మాట్లాడుకుంటున్నారు.

కలెక్షన్స్‌లో సత్తా చాటుతున్న యానిమేటెడ్ సినిమా.. కేవలం 8 రోజుల్లోనే అన్ని కోట్లు కొల్లగొట్టిందిగా..
X

దిశ, వెబ్‌డెస్క్: అశ్విన్ కుమార్(Ashwin Kumar) తెరకెక్కించిన యానిమేటెడ్ చిత్రం ‘మహావతార్ నరసింహ’(Mahavatar Narasimha) గురించే ప్రెజెంట్ అంతా ఎక్కువ‌గా మాట్లాడుకుంటున్నారు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ హిట్‌గా నిలిచింది. ప్రముఖ నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్ అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ పౌరాణిక యానిమేటెడ్ ప్రాజెక్ట్‌ను రూపొందించింది. పూర్తి స్థాయిలో యానిమేషన్‌తో రూపొందిన ఈ సినిమా థియేటర్లలోకి ఎలాంటి హైప్ లేకుండానే సైలెంట్‌గా అడుగుపెట్టినా, మొదటి షో నుంచే పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది.

అంతేకాకుండా కలెక్షన్ల విషయంలోనూ కోట్లు కొల్ల కొడుతోంది. ఇందులో భాగంగా ఈ సినిమా విడుదలైన కేవలం 8 రోజుల్లోనే రూ.60.5 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్లు మేకర్స్ ప్రకటించారు. దీంతో ఇండియాలో ఆల్ టైమ్ హైయెస్ట్ గ్రాసింగ్ యానిమేటెడ్ సినిమాగా చరిత్ర సృష్టించినట్లు తెలిపారు. అయితే వీకెండ్ కావడంతో ఈ కలెక్షన్స్ మరింత పెరిగే అవకాశం ఉందని సినీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. Link

Next Story