మళ్లీ మొదలైన ఐశ్వర్య లక్ష్మి-విష్ణు విశాల్ ఫైట్.. ‘గట్ట కుస్తీ-2’ ఫస్ట్ లుక్ రిలీజ్ డేట్ అప్డేట్ ఇచ్చిన మేకర్స్

by Mallepaka Hamsa |

విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్‌లో హీరో విష్ణు విశాల్ ఆరెంజ్ కలర్ టీషర్ట్ వేసుకుని, లుంగీ కట్టుకుని పక్కా లోకల్ మాస్ అవతారంలో కనిపిస్తున్నారు.

మళ్లీ మొదలైన ఐశ్వర్య లక్ష్మి-విష్ణు విశాల్ ఫైట్.. ‘గట్ట కుస్తీ-2’  ఫస్ట్ లుక్ రిలీజ్ డేట్ అప్డేట్ ఇచ్చిన మేకర్స్
X

దిశ, సినిమా: కోలీవుడ్ హీరో విష్ణు విశాల్ నటించిన సూపర్ హిట్ సినిమా ‘గట్ట కుస్తీ’. స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా 2022లో విడుదలైన ఈ చిత్రం తెలుగు, తమిళ భాషల్లో భారీ విజయాన్ని అందుకుంది. భార్యాభర్తల మధ్య ఈగోలు, కుస్తీ నేపథ్యంలో సాగే ఈ సినిమాలో విష్ణు విశాల్‌కు జోడీగా ఐశ్వర్య లక్ష్మి తన నటనతో అదరగొట్టింది. చెల్లా అయ్యావు దర్శకత్వం వహించిన మూవీప్రేక్షకులను ఎంతగానో నవ్వించింది. ఇక ఇప్పుడు ఈ బ్లాక్ బస్టర్ చిత్రానికి సీక్వెల్‌గా ‘గట్ట కుస్తీ-2’ రాబోతున్నట్లు ఇప్పటికే మేకర్స్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ ఇప్పటికే ప్రారంభమై శరవేగంగా జరుగుతోంది. ఫస్ట్ పార్ట్‌లో నటించిన ఐశ్వర్య లక్ష్మితో పాటు కరుణాస్, మునీష్కాంత్, కాళీ వెంకట్ వంటి నటీనటులు ఈ సీక్వెల్‌లోనూ కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు.

తాజాగా ‘గట్ట కుస్తీ-2’ సినిమా నుండి చిత్రబృందం డబుల్ అప్డేట్స్ ఇచ్చారు. విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్‌లో హీరో విష్ణు విశాల్ ఆరెంజ్ కలర్ టీషర్ట్ వేసుకుని, లుంగీ కట్టుకుని పక్కా లోకల్ మాస్ అవతారంలో కనిపిస్తున్నారు. మరింత కామెడీగా ఆయన రెండు చేతుల్లో ఏకంగా ఆరు ప్లాస్టిక్ బిందెలు పట్టుకుని, వీధి కుళాయి వద్ద నడుస్తూ కనిపించారు. ఆయన పక్కన మరికొన్ని ఖాళీ బిందెలు, వెనుక వరుసలో నిలబడిన మహిళలు కూడా ఉన్నారు. ఈ ఒక్క పిక్ చూస్తేనే మొదటి భాగం లాగే ఈ సీక్వెల్‌లో కూడా భార్యాభర్తల మధ్య వచ్చే గొడవలు, కామెడీ సీన్లు గట్టిగానే ఉండబోతున్నాయని అర్థమవుతోంది. అయితే ఈ చిత్రాన్ని జూలై 3న థియేటర్లలోకి తీసుకురాబోతున్నట్లు చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. ఈ సీక్వెల్ కూడా అవుట్ అండ్ అవుట్ పక్కా ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ఉండబోతుందని మేకర్స్ హింట్ ఇచ్చారు. ఇక ఈ చిత్రాన్ని విష్ణు విశాల్ సొంత బ్యానర్ విష్ణు విశాల్ స్టూడియోస్‌తో పాటు వేల్స్ ఫిల్మ్ ఇంటర్నేషన్‌తో కలిసి నిర్మిస్తున్నారు.

Next Story