అతనితో ప్రేమాయణం.. చివరికి లైఫ్‌లో పెళ్లే చేసుకోనంటూ బిగ్ బాంబ్ పేల్చిన నటి.. వెర్రి పుష్పాలు అనుకుంటున్నావా అంటూ ఏకిపారేస్తున్న నెటిజన్లు

by I. Sairam |

జబర్దస్త్ ఫేమ్ వర్ష(Varsha) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ ముద్దుగుమ్మ కమెడియన్ ఇమ్మాన్యుయిల్‌తో ప్రేమ వ్యవహారం నడిపిన సంగతి తెలిసిందే.

అతనితో ప్రేమాయణం.. చివరికి లైఫ్‌లో పెళ్లే చేసుకోనంటూ బిగ్ బాంబ్ పేల్చిన నటి.. వెర్రి పుష్పాలు అనుకుంటున్నావా అంటూ ఏకిపారేస్తున్న నెటిజన్లు
X

దిశ, వెబ్‌డెస్క్: జబర్దస్త్ ఫేమ్ వర్ష(Varsha) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ ముద్దుగుమ్మ కమెడియన్ ఇమ్మాన్యుయిల్‌తో ప్రేమ వ్యవహారం నడిపిన సంగతి తెలిసిందే. రష్మీ-సుధీర్ తర్వాత అంతగా క్రేజ్ తెచ్చుకున్న జంట అంటే వీరిదే చెప్పాలి. వీరిద్దరు కలిసి ఎన్నో స్కిట్స్ కూడా చేసి ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించారు. దీంతో వీరిద్దరు పెళ్లి కూడా చేసుకుంటారని నెటిజన్లు ఫిక్స్ అయిపోయారు. కానీ సడెన్‌గా ఏమైందో ఏమో కానీ ప్రజెంట్ అంతగా కలిసి ఉన్నట్లు కనిపించడం లేదు. ఈ క్రమంలో వర్ష చేసిన కామెంట్స్ నెట్టింట దుమారం రేపుతున్నాయి.

వర్ష హోస్ట్‌గా ఓ ఛానల్‌లో ఇంటర్వ్యూలు చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఓ ఎపిసోడ్‌లో భాగంగా ప్రేమ, పెళ్లి టాపిక్ రాగా వర్ష ఆసక్తికర సమాధానం చెప్పింది. పెళ్లి చేసుకుంటావా? నీకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా అని అడగ్గా దీనికి వర్ష సమాధానమిస్తూ.. ‘నేను లైఫ్‌లో అసలు పెళ్లి చేసుకోను. నాకు లవ్, పెళ్లి పై మంచి ఒపీనియన్ లేదు. లవ్, బ్రేకప్, మళ్ళీ లవ్ ఇలాంటివి అన్ని నాకు వద్దు. ఒకప్పుడు బాయ్ ఫ్రెండ్ లాగా ఒకడు ఉండేవాడు ఇప్పుడు లేడు. నాకు ఫ్యామిలీ ఇంపార్టెంట్. వాళ్ళ కోసమే బతుకుతున్నాను. ఇది ఫిక్స్’ అని చెప్పింది. దీంతో ఆమె చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్‌గా మారగా.. ఈ సెలబ్రిటీలు జనాలు వెర్రి పుష్పాలను చేయడంలో ముందుంటారు.. వీటిని చూసే వాళ్లు మనం పిచ్చోళ్లు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Next Story