క్యాన్సర్‌పై పోరాటం.. ఆ బాధను మాటల్లో వర్ణించలేనంటూ బోరున ఏడ్చిన నటి

by Mallepaka Hamsa |

బాలీవుడ్ నటి హీనా ఖాన్(Hina Khan) అందరికీ సుపరిచితమే. ‘యే రిష్తా క్యా కెహ్‌లాతా హై’ (Yeh rishta kya kehlata hai)హిందీ సీరియల్ ద్వారా ఫుల్ పాపులారిటీ తెచ్చుకుంది.

క్యాన్సర్‌పై పోరాటం.. ఆ బాధను మాటల్లో వర్ణించలేనంటూ బోరున ఏడ్చిన నటి
X

దిశ, సినిమా: బాలీవుడ్ నటి హీనా ఖాన్(Hina Khan) అందరికీ సుపరిచితమే. ‘యే రిష్తా క్యా కెహ్‌లాతా హై’ (Yeh rishta kya kehlata hai)హిందీ సీరియల్ ద్వారా ఫుల్ పాపులారిటీ తెచ్చుకుంది. అయితే ఆమె గత కొద్ది కాలం నుంచి రొమ్ము క్యాన్సర్‌తో పోరాటం చేస్తున్న విషయం తెలిసిందే. నిత్యం తన చికిత్స గురించి నెట్టింట పోస్టులు పెడుతూ అందరినీ భావోద్వేగానికి గురి చేస్తుంటుంది. ఆమె చేసే పోస్టులు నిమిషాల్లో వైరల్ అవుతాయనడంలో అతిశయోక్తి లేదు. ఇటీవల పూర్తిగా ఆమెకు తన బాయ్‌ఫ్రెండ్ సేవలు చేస్తున్నట్లు తెలుపుతూ ఓ ఎమోషనల్ పోస్ట్ పెట్టి నెటిజన్లు కన్నీళ్లు పెట్టుకునేలా చేసింది. అయితే తన ప్రియుడు తన కోసం అన్ని వదిలేసి వచ్చి తనకు సేవలు చేస్తున్నాడని అలాంటి భర్త అందరి అమ్మాయిలకు రావాలని చెప్పుకొచ్చింది. దీంతో అతని గొప్పతనాన్ని ఎంతో మంది మెచ్చుకున్నారు.

నిత్యం హీనా ఖాన్ తన చికిత్ర గురించి ఏదో ఒక పోస్టు పెడుతూనే వార్తల్లో నిలుస్తోంది. ఇదిలా ఉంటే.. తాజాగా, ఈ అమ్మడు ప్రపంచ క్యాన్సర్ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఓ కార్యక్రమంలో పాల్గొంది. ఇందులో భాగంగా ఎమోషనల్ కామెంట్స్ చేసి స్టేజ్ మీదనే బోరున ఏడ్చేసినట్లు సమాచారం. ‘‘టెస్ట్ రిపోర్టులో క్యాన్సర్‌కు సంబంధించిన లక్షణాలు ఉన్నట్లు వచ్చినప్పుడు ఎంతో బాధ పడ్డాను. దానిని మాటల్లో వర్ణించలేను. అతి ఎంత భారంగా ఉంటుందో మమ్మల్ని అడగండి మేము చెబుతాం అంటూ బోరున ఏడ్చేసింది. ఆ తర్వాతన తనను తాను సముదాయించుకుని.. ఆ రిపోర్టులు చదవడమే చాలా కష్టంగా అనిపిస్తుంటుందని చెప్పింది.

ఇక వైద్యులను సంప్రదించాలని దానిపై పోరాటం చేయాలని ఫిక్స్ అవ్వాలి. అయితే నేను నాకు క్యాన్సర్ ఉందని తెలిసిన రెండు, మూడు రోజుల్లోనే చికిత్స చేయించుకోవడం స్టార్ట్ చేశాను. చికిత్స విషయంలో ఆలస్యం చేయకూడదు. ఈ ప్రయాణంలో ఎన్నో ఇబ్బందులు పడ్డాను. ఎంతో బాధను తట్టుకోగలిగాను. కాబట్టి సమయానుగుణంగా కాస్త డబ్బులు ఖర్చు చేసి క్యాన్సర్‌కు సంబంధించిన టెస్టులు చేయించుకోవడం మంచిది. డబ్బు వృథాగా పెట్టామని అనుకోకండి. మీ ఆరోగ్యం బాగుంటే ఎంత డబ్బులు అయినా సంపాదించుకోవచ్చు. కాబట్టి క్యాన్సర్‌ను తేలికగా తీసుకోకండి’’ అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం హీనా ఖాన్ కామెంట్స్ నెట్టింట వైరల్‌గా మారాయి.

Next Story