- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Orange Movie: టైటిల్ వెనుక ఇంత స్టోరీ ఉందా?
బొమ్మరిల్లు భాస్కర్ మాట్లాడుతూ... ఆరెంజ్ మూవీకి ఆ టైటిల్ పెట్టడానికి ప్రధాన కారణం... సూర్యోదయం, సూర్యాస్తమయం రిఫరెన్స్ తీసుకోవడం వల్ల ఆ సినిమాకు ఆ పేరు పెట్టామని ఆయన చెప్పుకొచ్చాడు.

దిశ, వెబ్ డెస్క్ : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సినిమా ప్రస్థానం మొదలయ్యి చాలా సంవత్సరాలవుతుంది. ఆయన మొదటి నుండి కూడా మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ సినిమాలలో నటిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు. మగధీర లాంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత కాస్త కొత్తదనం కోసం చరణ్ 'ఆరంజ్' అనే క్లాస్ అండ్ క్యూట్ రొమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రంలో నటించాడు. ఈ సినిమా విడుదలకు ముందు దీనిపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అలా తారస్థాయి అంచనాల నడుమ విడుదల అయిన ఈ మూవీ ఆ సమయంలో ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేదు.
దానితో ఇది ఫ్లాప్ అయ్యింది. కానీ ప్రస్తుతం మాత్రం ఈ సినిమాను క్లాసిక్ అని, గొప్ప సినిమా అని, ఇప్పుడు గనక ఆరెంజ్ వచ్చి ఉంటే బ్లాక్ బాస్టర్ అయ్యేదని అనేకమంది అంటూ ఉంటారు. ఈ చిత్రానికి బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహించాడు. బొమ్మరిల్లు, పరుగు లాంటి విజయాల తర్వాత ఈయన ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు. కొన్ని రోజుల క్రితం భాస్కర్ ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. అందులో ఈ సినిమాకు అసలు ఆరెంజ్ అనే టైటిల్ ఎందుకు పెట్టామో క్లియర్గా వివరించారు.
భాస్కర్ తాజాగా మాట్లాడుతూ... ఆరెంజ్ చిత్రంలో ప్రేమ అనేది ప్రారంభ దశలో చాలా బాగుంటుంది, ఎంతో ఆనందాన్ని, ఉత్సాహాన్ని ఇస్తుంది. కానీ అదే కాలం గడుస్తున్నా కొద్ది ప్రేమ తగ్గుతూ ఉంటుంది. ప్రేమికుల మధ్యలో గొడవలు పెరుగుతూ ఉంటాయి. ఈ భావనను సూర్యోదయం, సూర్యాస్తమయంతో పోల్చాము. సూర్యోదయం అంటే ప్రేమ పుట్టుక, సూర్యాస్తమయం అంటే ప్రేమ క్షీణించే దశను తెలియజేస్తుంది. ఒక ప్రేమ వెళ్లాక మరో ప్రేమ ఆరెంజ్ దశలో వస్తుందని ఈ టైటిల్ పెట్టినట్లు ఆయన చెప్పారు. ఈ చిత్రంలో జెనీలియా హీరోయిన్గా నటించగా, హారిస్ జయరాజ్ సంగీతం అందించాడు. నాగబాబు ఈ చిత్రాన్ని నిర్మించాడు.






