- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రవితేజను అందుకే గట్టిగా కొట్టా.. సీవీఎల్ నరసింహారావు
తాజాగా సీవీఎల్ నరసింహారావు మాట్లాడుతూ... వెంకీ తర్వాత నాకు స్నేహకి విభేదాలు వచ్చాయని వార్తలు వైరల్ అయ్యాయి, అవి ఏమాత్రం వాస్తవం కాదు. వెంకీ సినిమా సమయంలో ఓ సన్నివేశంలో నేను రవితేజను కొట్టాలి. ఆ సమయంలో నాటకరంగం మాదిరి నేను చాలా గట్టిగా కొట్టాను. నాకు సినిమా కెమెరా యాంగిల్స్, లైటింగ్ గురించి పెద్దగా అవగాహన లేకపోవడం వల్లే అలా జరిగింది అని ఆయన క్లారిటీ ఇచ్చారు.

దిశ, వెబ్ డెస్క్ : తెలుగు సినీ పరిశ్రమలో మంచి గుర్తింపును సంపాదించుకున్న నటులలో సీవీఎల్ నరసింహారావు ఒకరు. ఈయన ఇప్పటివరకు ఎన్నో సినిమాల్లో ముఖ్యమైన పాత్రల్లో నటించి తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్న సందర్భాలు ఉన్నాయి. ఈ నటుడు తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. అందులో నరసింహారావు గారు తనకు మంచి గుర్తింపును తీసుకువచ్చిన 'వెంకీ' చిత్రం గురించి, అలాగే ఆ సినిమాలో హీరో హీరోయిన్లుగా నటించిన రవితేజ, స్నేహకు సంబంధించిన కొన్ని విషయాలను తెలియజేశాడు.
తాజాగా నరసింహారావు మాట్లాడుతూ... "నేను చాలా సంవత్సరాల క్రితం రవితేజ హీరోగా, స్నేహ హీరోయిన్గా శ్రీను వైట్ల దర్శకత్వంలో రూపొందిన 'వెంకీ' సినిమాలో నటించాను. ఆ మూవీలో నేను స్నేహకు తండ్రి పాత్రలో కనిపించాను. ఆ చిత్రం నాకు మంచి పేరును తీసుకువచ్చింది. కానీ 'వెంకీ' సినిమా పూర్తి అయిన తర్వాత నాకు, స్నేహకు మధ్య విభేదాలు వచ్చాయి అని వార్తలు వచ్చాయి. కానీ అవి ఏమాత్రం వాస్తవం కాదు. నేను, స్నేహతో చాలా బాగుంటాను. స్నేహ చాలా మంచి అమ్మాయి.
అలాంటి అమ్మాయితో నాకు ఎందుకు గొడవలు ఉంటాయి. మా మధ్య ఎలాంటి విభేదాలు లేవు" అని క్లారిటీ ఇచ్చాడు. అలాగే 'వెంకీ' సినిమా సమయంలో రవితేజతో ఓ సన్నివేశం ఉంటుంది. అందులో నేను రవితేజను కొట్టాలి. ఆ సన్నివేశంలో నాటక రంగంలో మాదిరి చాలా గట్టిగా కొట్టాను. సినిమా కెమెరా యాంగిల్స్, లైటింగ్ గురించి పెద్దగా అవగాహన లేకపోవడం వల్ల రవితేజతో అలా జరిగింది అని ఆయన క్లారిటీ ఇచ్చాడు. రవితేజ చాలా మంచివారు. షూటింగ్స్ స్పాట్ లో ఎంతో సరదాగా ఉండేవారు. మా అందరితో ఎంతో ఆప్యాయంగా మాట్లాడేవారు అని నరసింహారావు చెప్పుకొచ్చారు.






