- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘ద్రోణ’లో బికినీ అందుకే వేశాను.. ఫుల్ క్లారిటీ ఇచ్చిన ప్రియమణి
ప్రియమణి మాట్లాడుతూ... ద్రోణ సినిమాలో నేను స్విమ్ సూట్ వేశాను. స్విమ్ చేయాలంటే స్విమ్ సూట్ వేసుకోవాల్సిందే. నాకు అంతే అనిపించింది, అంతకు మించి ఏమీ అనిపించలేదు. అందుకే ఆ సినిమాలో స్విమ్ సూట్ వేశాను అని ఆమె చెప్పుకొచ్చింది.

దిశ, వెబ్ డెస్క్: చాలా సంవత్సరాల క్రితం ప్రియమణి, నితిన్ హీరోగా రూపొందిన ద్రోణ అనే చిత్రంలో హీరోయిన్గా నటించింది. ఈ సినిమా సమయంలో టాలీవుడ్ ఇండస్ట్రీలోని హీరోయిన్లు పెద్దగా బికినీ సన్నివేశాలు చేసేవారు కాదు. అలాంటి సమయంలో ద్రోణ చిత్రంలో ప్రియమణి బికినీ వేసుకుంది. దానితో ఆ టైంలో ఈ విషయం చాలా పెద్ద న్యూస్ అయింది. అలాగే ప్రియమణికి కూడా ఈ సినిమా ద్వారా మంచి గుర్తింపు వచ్చింది. తాజాగా ఈ బ్యూటీ వరలక్ష్మీ శరత్ కుమార్ ప్రధాన పాత్రలో నటించి, దర్శకత్వం వహించిన సరస్వతీ చిత్రంలో కీలకమైన పాత్రలో నటించింది.
ఈ సినిమా ఈరోజు విడుదలైంది. ఈ సినిమా విడుదల సందర్భంగా వరలక్ష్మి శరత్ కుమార్ తో పాటు ప్రియమణి కూడా ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. అందులో భాగంగా ద్రోణ సినిమాలో బికినీ వేయడం గురించి ఆమె ఓపెన్ అయింది. తాజాగా ప్రియమణి మాట్లాడుతూ... "చాలా సంవత్సరాల క్రితం నేను ద్రోణ సినిమాలో స్విమ్ సూట్ వేశాను. కామన్ గా మనం స్విమ్ చేయడానికి వెళ్లేటప్పుడు చీర కట్టుకొని వెళ్లలేము, స్విమ్ సూట్ వేసుకొని వెళ్ళాలి.
ఆ సినిమా సమయంలో దర్శకుడు మీరు స్విమ్ సూట్ వేసుకుంటారా అని అడిగారు, నాకు ఇందులో పెద్దగా ఏముంది వేసేద్దాం అని అనుకున్నాను, అలాగే చేశాను. మనం ఫారన్ కంట్రీస్ కి వెళ్ళినప్పుడు అక్కడ ఎంతోమంది స్విమ్ సూట్ వేసుకొని ఉంటారు, నాకు సినిమాలో కూడా స్విమ్ సూట్ వేసుకోవడం అలాగే అనిపించింది" అని ఈమె చెప్పుకొచ్చింది. ఇకపోతే ప్రస్తుతం ప్రియమణి చేతిలో చాలా సినిమాలు ఉన్నాయి. చిరంజీవి, బాబి కాంబోలో తెరకెక్కబోయే సినిమాలో కూడా ప్రియమణి హీరోయిన్గా కనిపించే అవకాశాలు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.






