అందుకే అలాంటి పాత్రలకు ప్రాధాన్యం ఇవ్వను: సందీప్ రెడ్డి వంగా

by Mallepaka Hamsa |   (  Updated:2024-12-07 11:49:44  IST  )

స్టార్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా(Sandeep Reddy Vanga) ‘అర్జున్ రెడ్డి’ మూవీతో ప్రేక్షకుల్లో గుర్తింపు తెచ్చుకున్నారు.

అందుకే అలాంటి పాత్రలకు ప్రాధాన్యం ఇవ్వను: సందీప్ రెడ్డి వంగా
X

దిశ, సినిమా: స్టార్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా(Sandeep Reddy Vanga) ‘అర్జున్ రెడ్డి’ మూవీతో ప్రేక్షకుల్లో గుర్తింపు తెచ్చుకున్నారు. ఒక గత ఏడాది ‘యానిమల్’(Animal ) సినిమాతో ఘన విజయాన్ని అందుకుని అందరి దృష్టిని తనవైపుకు తిప్పుకున్నారు. ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌(Prabhas) హీరోగా నటిస్తున్న ‘స్పిరిట్’(Spirit) మూవీకి దర్శకత్వం వహిస్తున్నారు. ఆ తర్వాత ‘యానిమల్ పార్క్’(Animal Park) చేయబోతున్నారు. ఎంత బిజీగా ఉన్నప్పటికీ సందీప్ రెడ్డి వంగా నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ తనపై ట్రోల్ చేస్తున్న వారికి స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తుంటారు. ఇదిలా ఉంటే.. తాజాగా, సందీప్ రెడ్డి వంగా తన సినిమాల్లో తల్లి పాత్రకు ప్రాధాన్యత ఇవ్వకపోవడానికి కారణం ఏంటో వెల్లడించారు.

‘‘నా నిజ జీవితంలో మా అమ్మతో నేను చాలా చనువుగా ఉంటాం. ఆమె నాకు ఎంతో సపోర్ట్ చేస్తుంది. కెరీర్‌లో ముందుకెళ్లడానికి కూడా మా అమ్మ సహకరించింది. చిన్నప్పుడు నా యాక్టింగ్ స్కూల్ ఫీజుల దగ్గర నుంచి ‘అర్జున్ రెడ్డి’ ప్రొడక్షన్ పనుల వరకు ఎన్నో విషయాల్లో సహాయం చేసింది. మా అమ్మతో ఉన్న ఎటాచ్‌మెంట్ వల్ల నేను ఆమెను ఎదిరించిన సందర్భాలు కూడా ఉన్నాయి. మా బంధంలో ఎలాంటి సమస్యలు లేకపోవడం వల్లే నా చిత్రాల్లో తల్లి పాత్రకు ప్రాధాన్యం ఇవ్వడం లేదు. ఒకవేళ తల్లి-కుమారుడి సెంటిమెంట్‌తో నేను సినిమా చేస్తే అది పాజిటివ్‌గా తీస్తాను. ఇందులో హింసకు చోటుండదు. గుడ్ వైబ్స్‌తో అన్ని సీన్స్ ఉంటాయి’’ అని చెప్పుకొచ్చారు.

Next Story