- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అందుకే చిరంజీవి సినిమా ఆఫర్‌ను తిరస్కరించా.. ఇంద్రజ కామెంట్స్ వైరల్
ఇంద్రజ మాట్లాడుతూ... చిరంజీవి హీరోగా రూపొందిన ‘అల్లుడా మజాకా’, ‘హిట్లర్’ సినిమాల్లో అవకాశాలు వచ్చినప్పటికీ, కొన్ని కారణాల వల్ల వాటిని తిరస్కరించినట్లు చెప్పుకొచ్చింది.

దిశ, వెబ్ డెస్క్: 90ల దశకంలో తిరుగులేని స్టార్ హీరోగా కెరీర్‌ను కొనసాగించిన చిరంజీవి పక్కన నటించాలని ఎంతోమంది స్టార్ హీరోయిన్లు కోరుకునేవారు. అలాంటి వారిలో ఇంద్రజ కూడా ఒకరు. అయితే ఆమెకు ఇప్పటివరకు చిరంజీవి సినిమాలో నటించే అవకాశం రాలేదు. కానీ రెండు సందర్భాల్లో ఆ అవకాశం వచ్చిందని, అయితే ఎందుకు ఆ సినిమాల్లో భాగం కాలేకపోయానో తాజాగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది. ఇంద్రజ మాట్లాడుతూ.. “మెగాస్టార్ చిరంజీవి గారు అంటే నాకు ఎంతో అభిమానం. ఆయన సినిమాల్లో హీరోయిన్‌గా నటించాలని కోరిక ఉండేది. హీరోయిన్‌గా కాకపోయినా ఆయన పక్కన డాన్స్ చేయాలనే కోరిక బలంగా ఉండేది. కానీ ఇప్పటివరకు నా ఆ కోరిక తీరలేదు. మొదటిసారి చిరంజీవి గారితో నటించే అవకాశం ఈవీవీ సత్యనారాయణ దర్శకత్వంలో రూపొందిన ‘అల్లుడా మజాకా’ సినిమాలో వచ్చింది.
అయితే ఆ మూవీలో ఆయనకు చెల్లెలి పాత్ర కోసం నన్ను సంప్రదించారు. కానీ చిరంజీవి గారి పక్కన హీరోయిన్‌గా నటించాలి లేదా కనీసం ఆయనతో మాస్ సాంగ్‌లో డాన్స్ చేయాలనే ఆలోచన నాలో ఉండేది. అలాంటి సమయంలో చెల్లెలి పాత్ర రావడంతో సున్నితంగా ఆ ఆఫర్‌ను తిరస్కరించాను. ఆ తర్వాత కొంతకాలానికి ఎడిటర్ మోహన్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘హిట్లర్’ సినిమాలో రాజేంద్ర ప్రసాద్ పక్కన ఓ కీలక పాత్రలో అవకాశం వచ్చింది. కానీ అదే సమయంలో నేను మరో సినిమాలో నటిస్తూ బిజీగా ఉండటంతో ఆ మూవీలో నటించలేకపోయాను. అలా రెండు సార్లు చిరంజీవి గారి సినిమాలో నటించే అవకాశం మిస్ అయింది” అని ఇంద్రజ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఇంద్రజ పలు సినిమాల్లో నటిస్తూ, కొన్ని టీవీ కార్యక్రమాలకు జడ్జిగా వ్యవహరిస్తూ బిజీగా సమయాన్ని గడుపుతోంది.






