22 సంవత్సరాలుగా మేము ఇంత హ్యాపీగా ఉండటానికి కారణం అదే.. స్టార్ హీరోయిన్ భర్త ఇంట్రెస్టింగ్ కామెంట్స్

by I. Sairam |

“బాయ్స్”(Boys) సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన జెనీలియా(Genelia) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

22 సంవత్సరాలుగా మేము ఇంత హ్యాపీగా ఉండటానికి కారణం అదే.. స్టార్ హీరోయిన్ భర్త ఇంట్రెస్టింగ్ కామెంట్స్
X

దిశ, వెబ్‌డెస్క్: “బాయ్స్”(Boys) సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన జెనీలియా(Genelia) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆ తర్వాత “సత్యం”(Satyam) మూవీతో ప్రేక్షకుల మనసులు గెలుచుకుంది. దీంతో వరుస ఆఫర్లు క్యూ కట్టాయి. అలా “సాంబ”(Samba), “నా అల్లుడు”(Naa Alludu), “సుభాష్ చంద్రబోస్”(Subhash Chandra Bose), “హ్యాపీ”(Happy), “బొమ్మరిల్లు”(Bommarillu), “ఢీ”(Dhee), “మిస్టర్ మేధావి”(Mister Medhavi), “రెడీ”(Ready), “కథ”(Katha), “ఆరెంజ్”(Orange), “నా ఇష్టం”(Na Istam) వంటి చిత్రాల్లో నటించి స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు పొందింది.

ఇక ఆమె పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే.. జెనీలియా 2012లో బాలీవుడ్ నటుడు రితేష్ దేశ్‌ముఖ్‌(Rithesh Deshmukh)ను వివాహం చేసుకుంది. ఈ ఇద్దరూ కలిసి “తుఝే మేరీ కసమ్” సినిమా షూటింగ్ సమయంలో పరిచయమై, దాదాపు ఒక దశాబ్దం పాటు ప్రేమలో ఉన్న తర్వాత పెళ్లి చేసుకున్నారు. వీరికి ఇద్దరు కుమారులు రియాన్(Riyan), రాహుల్(Rahul). పెళ్లి తర్వాత జెనీలియా సినిమాలకు కొంత గ్యాప్ వచ్చింది. మళ్లీ రీ ఎంట్రీ ఇవ్వడానికి రెడీగా ఉంది. అయితే తాజాగా జెనీలియా భర్త రితేష్ ఓ ఇంటర్వ్యూలో పాల్గొని తన హ్యాపీ మ్యారీడ్ లైఫ్‌ గురించి కొన్ని ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు.

ఆయన మాట్లాడుతూ.. ‘గత 22 సంవత్సరాలుగా మేము కలిసి ఉన్నాము. అయితే అందరి లాగే మా మధ్య కూడా గొడవలు అవుతాయి. కానీ, వాటిని నేను, జెనీలియా రోజు ముగిసేలోపు అనగా సాయంత్రం లోపు తమ తగాదాలను పరిష్కరించుకుంటాము. దీంతో నెక్స్ట్ డే మేము మళ్లీ కొత్త రోజును ప్రారంభిస్తాము. అయితే సాధారణంగా తప్పు చేసేది నేనే కాబట్టి క్షమాపణ చెప్పడం నాకు సులభం అని ఫన్నీగా చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఆయన చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతోంది. ఇక దీనిపై నెటిజన్లు వావ్ సూపర్ కపుల్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.


Next Story