- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నన్ను స్టార్ హీరో చేసిన సినిమా అదే.. మహేష్ బాబు ఇంట్రెస్టింగ్ కామెంట్స్
సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh Babu) హీరోగా దర్శకధీరుడు ఎస్.ఎస్ రాజమౌళి(SS Rajamouli) ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం 'వారణాసి'(Varanasi).

దిశ, వెబ్‌డెస్క్: సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh Babu) హీరోగా దర్శకధీరుడు ఎస్.ఎస్ రాజమౌళి(SS Rajamouli) ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం 'వారణాసి'(Varanasi). ఇందులో రుద్రగా, రాముడి పాత్రలో మహేష్ కనిపించనున్నారు. ఇది ఆయన కెరీర్‌లో 29వ చిత్రంగా రూపొందనున్నది. ఇక ఇప్పటి వరకు ప్రాంతీయ చిత్రాలతోనే రికార్డులు బ్రేక్ చేసిన మహేష్ బాబు.. ఇప్పుడు ఏకంగా గ్లోబల్ మార్కెట్‌ని టార్గెట్ చేస్తున్నారు. 'వారణాసి' సినిమాలో మహేష్ బాబు రుద్ర పాత్రలో నటిస్తుండగా.. మందాకినిగా ప్రియాంక చోప్రా, కుంభగా పృథ్వీరాజ్ సుకుమారన్ కనిపించనున్నారు.
ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్, టైటిల్ టీజర్‌కు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. ప్రమోషన్స్‌లో భాగంగా రాజమౌళి, మహేష్, ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ కలిసి పలు హాలీవుడ్ ఛానల్స్‌కి ఇంటర్వ్యూలు ఇచ్చారు. ఈ నేపథ్యంలో మహేష్ పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఆయన మాట్లాడుతూ.. 'నిజం చెప్పాలంటే, ప్రతి సినిమా ఏదొక మార్పు తీసుకొస్తుంది. నన్ను మార్చిన సినిమాల్లో 'పోకిరి'(Pokiri) ఒకటి. అది నన్ను ఒక స్టార్‌ను చేసింది, కాబట్టి సహజంగానే అది ఆ కెరీర్‌ను మార్చిన సినిమా అని చెప్పాలి. 2006లో వచ్చిన ఆ సినిమా చాలా పెద్ద హిట్ అయింది. అది నా జీవితంలో ఎంత మార్పు తెచ్చిందంటే, ఆ సినిమా తర్వాత నేను గందరగోళానికి గురయ్యాను.
ఏం చేయాలో నాకు తెలియలేదు. ఎందుకంటే ప్రేక్షకుల అంచనాలు చాలా ఎక్కువగా ఉండే ఒక దశలోకి వెళ్లిపోయాను. ఆ సమయంలో తర్వాత ఎలాంటి సినిమా చేయాలో తెలియని పరిస్థితి ఏర్పడింది. కాబట్టి, ప్రతి సినిమా మన మైండ్ సెట్‌ని, ఆలోచనా విధానాన్ని మారుస్తుంది. కానీ ఇప్పుడు 'వారణాసి' సినిమా విషయంలో, ఇంతకముందు లేని అనుభవాన్ని పొందుతున్నాను. ఇది నిజంగా పూర్తిగా భిన్నమైన అద్భుతమైన ఎక్స్ పీరియన్స్' అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఆయన చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్‌గా మారాయి.






