Rashmika Mandanna: అది అతని నైజం.. అలాంటి వ్యక్తులు సమాజంలో కూడా ఉన్నారంటూ రష్మిక ఆసక్తికర కామెంట్స్

by Hamsa |
Rashmika Mandanna: అది అతని నైజం.. అలాంటి వ్యక్తులు సమాజంలో కూడా ఉన్నారంటూ రష్మిక ఆసక్తికర కామెంట్స్
X

దిశ, సినిమా: స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న(Rashmika Mandanna) వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతుంది. ఇటీవల ఆమె ‘పుష్ప-2’(Pushpa 2: The Rule ) సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి బ్లాక్ బస్టర్ హిట్‌‌ను సాధించింది. అయితే ఇందులో హీరో పాత్రపై పలు విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో.. తాజాగా, రష్మిక ఓ ఇంటర్వ్యూలో పాల్గొని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. ‘‘కథ ఆధారంగానే పాత్రలు హైలైట్ చేయాలో ఆలోచిస్తారు.

ఒకవేళ హీరో దృష్టి కోణంలో రాస్తే అతని పాత్రకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. హీరోయిన్(Heroine) కోసం రాస్తే ఆమెను హైలైట్ చేస్తారు. పాత్రల స్వభావాలు కూడా స్టోరీ ఆధారంగానే ఉంటాయి. ఏ మనిషిలో అయినా మంచి చెడు అనే రెండు గుణాలు ఉంటాయి. మా అమ్మ ఎప్పుడూ ఒక విషయాన్ని చెబుతుంటుంది. ఇద్దరి వ్యక్తుల మధ్య వ్యత్యాసం.. వారి స్వభావం ఆధారంగానే ఉంటుందని అంటుంది. మనందరం పీల్చే గాలి, తినే ఆహారం, తాగే నీళ్లు అన్ని ఒక్కటే.. కాకపోతే ఈగో వల్లే ఇద్దరి మధ్య వ్యత్యాసం వస్తుంది.

అలాంటప్పుడు సినిమాల్లో పాత్రలను నిందించడం తప్పు. పుష్ప రాజ్(Pushpa Raj) పాత్ర స్వభావాన్ని కాకుండా కుటుంబం కోసం అతను ఏం చేశాడో చూడండి. అలా ఉండడం అతని నైజం. అలాంటి వ్యక్తులు సమాజంలో కూడా ఉన్నారు’’ అని చెప్పుకొచ్చింది. ఇక రష్మిక సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం ఆమె కుబేర, ది గర్ల్ ఫ్రెండ్ మూవీ షూటింగ్స్‌లో పాల్గొంటూ ఫుల్ బిజీ బిజీగా గడుపుతోంది.

Advertisement

Next Story

Most Viewed