చిరు చిత్రంలో ఆ యంగ్ హీరో?

by Pulgam srinivas |

మెగాస్టార్ చిరంజీవి సినిమాలో కీలక పాత్ర కోసం నారా రోహిత్‌ను మేకర్స్ సంప్రదించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

చిరు చిత్రంలో ఆ యంగ్ హీరో?
X

దిశ, వెబ్ డెస్క్: మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం దర్శకుడు బాబి కొల్లి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రంలో హీరోగా నటిస్తున్నాడు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ క్రేజీ అప్‌డేట్ టాలీవుడ్ సర్కిల్లో వైరల్‌గా మారింది. ఈ సినిమాలో ఓ కీలకమైన పాత్ర ఉన్నట్లు, అది సెకండ్ హాఫ్‌లో రానున్నట్లు సమాచారం. ఆ పాత్ర కోసం టాలీవుడ్ యువ నటుడు నారా రోహిత్ ను మేకర్స్ సంప్రదించినట్లు తెలుస్తోంది. అన్నీ ఓకే అయితే ఈ సినిమాలోని కీలక పాత్రలో నారా రోహిత్ కనిపించే అవకాశాలు ఉన్నట్లు ఓ వార్త బలంగా వినిపిస్తోంది. అదే గనుక జరిగితే ఈ సినిమాకు అదనపు మైలేజ్ చేకూరే అవకాశాలు ఉన్నాయని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఇక ఈ సినిమాలో చిరంజీవికి కూతురు పాత్రలో అనశ్వర రాజన్ కనిపించబోతున్నట్లు సమాచారం. అలాగే ఈ చిత్రంలో చిరంజీవి అదిరిపోయే రేంజ్ లుక్‌లో కనిపించబోతున్నట్లు, ఇప్పటివరకు తన కెరీర్‌లో చేయని విభిన్నమైన పాత్రలో కనిపించనున్నట్లు బాబి కొల్లి ఇప్పటికే హింట్ ఇచ్చాడు. దీంతో ఈ సినిమాపై ప్రస్తుతం మంచి అంచనాలు నెలకొన్నాయి.

Next Story