- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆ వీడియో నా జీవితాన్నే మార్చేసింది.. పేరెంట్స్ కూడా దూరం పెట్టారు.. ఇనయా సుల్తానా
తాజాగా ఇనయా సుల్తానా మాట్లాడుతూ... పుట్టినరోజు వేడుకల్లో ఆర్జీవీ గారితో నేను డాన్స్ చేశాను. ఆ వీడియో చాలా వైరల్ అయింది. అది వైరల్ కావడం వల్ల నా జీవితం చాలా ఎఫెక్ట్ అయింది. వీడియో అంతలా వైరల్ కావడంతో నా పేరెంట్స్ కూడా నన్ను దూరం పెట్టారు. అలాగే మా బంధువులు కూడా నాతో సరిగా ఉండటం లేదు అని ఇనయా సుల్తానా చెప్పుకొచ్చింది.

దిశ, వెబ్ డిస్క్ : సినిమా ఇండస్ట్రీలోకి కొంతమంది కుటుంబ అంగీకారంతో వస్తే, మరి కొంతమంది మాత్రం సినిమాపై ప్యాషన్ ఉండి, కుటుంబం దానిని వ్యతిరేకించిన వారి నుండి దూరమై పరిశ్రమలోకి వస్తుంటారు. కుటుంబానికి ఇష్టం లేకపోయినా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి ప్రస్తుతం తనకంటూ ఒక గుర్తింపు ఏర్పరచుకున్న ముద్దుగుమ్మలలో ఇనయా సుల్తానా ఒకరు. ఈ బ్యూటీ తెలుగు బిగ్ బాస్ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసింది. దీని ద్వారా ఈ నటి బుల్లితెర ప్రేక్షకులకు బాగా దగ్గరైంది. ఆ తర్వాత ఈమె పలు టీవీ షోలలో కూడా పార్టిసిపేట్ చేసింది. అలాగే కొన్ని సినిమాల్లో కూడా నటించింది.
తాజాగా ఇనయా ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. అందులో ఈ నటి తనకు ఒక వీడియో ద్వారా అనేక కష్టాలు ఎదురయ్యాయని, ఆఖరికి దానివల్ల కుటుంబం మొత్తానికే దూరమయ్యారని ఆవేదన వ్యక్తం చేసింది. తాజాగా ఇనయా సుల్తానా మాట్లాడుతూ... "నేను పుట్టినరోజు వేడుకల్లో రామ్ గోపాల్ వర్మ గారితో కలిసి డాన్స్ చేశాను. ఆ వీడియో అంతలా వైరల్ అవుతుందని నేను అనుకోలేదు. తీరా చూస్తే ఆ తర్వాత ఆ వీడియో చాలా వైరల్ గా మారింది. దాని ప్రభావం నాపై చాలా గట్టిగా పడింది. వీడియో వైరల్ అయిన తర్వాత నా కుటుంబం నన్ను దూరం పెట్టింది.
ఆ తర్వాత నా కుటుంబం మాత్రమే కాకుండా నా బంధువులు కూడా నన్ను దూరం పెట్టడం మొదలుపెట్టారు" అని ఆమె చెప్పింది. అలాగే నేను సినిమాల్లోకి రావడం మొదటి నుండి మా కుటుంబానికి ఇష్టం లేదు. అయినా కూడా నేను ఇండస్ట్రీ లోకి రావాలనుకున్నాను. దానితో నేను కేవలం 100 రూపాయలతో ఇంట్లో నుండి బయటకు వచ్చేసాను. హాస్టల్ ఫీజుల కోసం, ఖర్చుల కోసం చిన్న చిన్న పాత్రల్లో నటించాను. కాస్టింగ్ కౌచ్‌ను ఎదుర్కొని ఎన్నో అవకాశాలను వదులుకున్నాను. ప్రస్తుతం ఎలాంటి కమిట్మెంట్లు లేకుండా మంచి అవకాశాలను అందుకుంటున్నాను. నిజాయితీగా సినిమా ఇండస్ట్రీలో ఎదుగుతున్నందుకు ఆనందంగా ఉంది అని ఇనయా సుల్తానా చెప్పుకొచ్చింది.
- Tags
- InayaSultana
- rgv






