- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆ స్టార్ హీరో వల్ల నా కల నెరవేరింది, అతనికి ధన్యవాదాలు.. అజిత్ డాటర్ ఇంట్రెస్టింగ్ పోస్ట్
స్టార్ హీరో ధనుష్(Dhanush) దర్శకత్వంలో తెరకెక్కిన మూడో సినిమా ‘జాబిలమ్మ నీకు అంత కోపమా’(Jabilamma Neeku Antha Kopama).

దిశ, వెబ్‌డెస్క్: స్టార్ హీరో ధనుష్(Dhanush) దర్శకత్వంలో తెరకెక్కిన మూడో సినిమా ‘జాబిలమ్మ నీకు అంత కోపమా’(Jabilamma Neeku Antha Kopama). ఈ చిత్రంలో పవిష్(Pavish) హీరోగా అనిఖా సురేంద్రన్(anikha Surendran) హీరోయిన్‌గా నటించారు. అయితే వండర్ బార్ ఫిల్మ్స్ పతాకంపై ధనుష్, కస్తూరి రాజా నిర్మించిన ఈ చిత్రం లవ్ అండ్ కామెడీ ఎమోషనల్ ఎక్స్ పీరియన్స్‌గా రూపొందింది. ఇక స్టార్ డైరెక్టర్ జీవీ ప్రకాష్ కుమార్(GV Prakash Kumar) ఈ మూవీకి సంగీతం అందించారు. అయితే ఫిబ్రవరి 21న థియేటర్లలో రిలీజ్ అయిన ఈ చిత్రం మంచి టాక్ తెచ్చుకుంటుంది. ఈ క్రమంలో యంగ్ బ్యూటీ అనిఖా పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది.
తాజాగా ఈ భామ తన ఇన్‌స్టా వేదికగా ఓ పోస్ట్ పెట్టింది. అందులో కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్‌తో దిగిన ఫొటోను షేర్ చేస్తూ.. ‘‘జాబిలమ్మ నీకు అంత కోపమా ముగిసింది. ధనుష్ సార్‌కి ఎప్పటికీ కృతజ్ఞతలు. మీరు నా కలలను నిజం చేశారు. ధనుష్ సార్‌కు నేను పెద్ద అభిమానిని. నేను ఒక్క సినిమా చాన్స్ కావాలి అని అడిగాను. దాంతో ఆయన నాకు అవకాశం ఇచ్చారు. ధనుష్ దర్శకత్వంలో నటించడం అనేది నేను కలలో కూడా ఊహించని విషయం. ధనుష్ సార్‌కు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను” అని రాసుకొచ్చింది అనిఖా సురేంద్రన్.
ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక దీన్ని చూసిన నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. కాగా అనిఖా సురేంద్రన్ చాలా సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్‌గా అలరించింది. స్టార్ హీరో అజిత్(Ajith) నటించిన సినిమాల్లో బ్యాక్ టు బ్యాక్ ఆయన కూతురిగా నటించి ఆకట్టుకుంది. ఇక ఇప్పుడు హీరోయిన్‌గా మారి సినిమాలు చేస్తుంది ఈ అమ్మడు. తెలుగులో ‘బుట్టబొమ్మ’(Buttabomma) సినిమాతో అకట్టుకుంది అనిఖా సురేంద్రన్.






