- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
ఆ స్టార్ హీరో నాతో అసభ్యంగా ప్రవర్తించాడు.. టార్చర్ చేశాడంటూ హీరోయిన్ సంచలన పోస్ట్

దిశ, సినిమా: గత కొద్ది రోజుల నుంచి సినిమా ఇండస్ట్రీలో ఊహించని సంఘటనలు చోటుచేసుకుంటూ అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. పలువురు తమ తోటి నటులు అసభ్యంగా ప్రవర్తించడంతో పాటు వాడుకుని మోసం చేశారంటూ ఆరోపణలు చేస్తున్నారు. అయితే ఇటీవల వేధింపుల కేసుల్లో జానీ మాస్టర్(Jani Master) తో పాటు పలువురు అరెస్ట్ అయి పోలీస్ స్టేషన్ వరకు వెళ్లి వచ్చిన విషయం తెలిసిందే. ఇలాంటి సంఘటనలు అన్ని ఇండస్ట్రీల్లో తలెత్తుతున్నాయి. తాజాగా, ఓ మలయాళ హీరోయిన్ తనతో ఓ హీరో అసభ్యంగా ప్రవర్తించాడని తెలుపుతూ పలు సంచలన వ్యాఖ్యలు చేసింది. ఇక ఈ వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా షేర్ చేయడంతో అది కాస్త సోషల్ మీడియాలో దుమారం రేపుతోంది.
అసలు విషయంలోకి వెళితే.. మలయాళ హీరోయిన్ విన్సీ సోనీ(Vincy Sony) తనకు ఎదురైన అనుభవాన్ని అందరికీ ధైర్యంగా చెప్పుకొచ్చింది. ‘‘గతంలో నేను ఓ సినిమా షూటింగ్‌లో పాల్గొన్న సమయంలో ఓ స్టార్ హీరో డ్రగ్స్ తీసుకుని నా దగ్గరకు వచ్చాడు. అయితే అప్పుడు నేను ఓ సీన్ షూటింగ్‌లో ఉన్నాను. షూట్ జరుగుతున్న సమయంలోనే నా దుస్తుల విషయంలో ఇబ్బంది తలెత్తింది. దీంతో నేను మార్చుకోవడానికి వెళ్తుండగా.. అందరూ చూస్తుండానే ఈ హీరో నా డ్రెస్ సరిచేయడానికి ప్రత్నించాడు. అంతేకాకుండా తనముందే మార్చుకోమని టార్చర్ చేశాడు. నాకు ఇబ్బందిగా అనిపించింది. అప్పుడు అతను తెల్లటి పొడిని కూడా తీసుకోవడం కనిపించింది. డ్రగ్స్ తీసుకున్నాడని అర్ధం అయింది.
అది ఆయన వ్యక్తిగత విషయం అయినప్పటికీ షూటింగ్ సమయంలో తీసుకోవడం ఇతరులకు ఇబ్బందిగా ఉంటుందనే ఇంకిత జ్ఞానం కూడా లేకుండా డ్రగ్స్ తీసుకున్నాడు. నేను అప్పుడే ఓ నిర్ణయానికి వచ్చాను. డ్రగ్స్ తీసుకునేవారితో అస్సలు నటించకూడదని డిసైడ్ అయ్యాను. ఈ విషయం చెబితే నాకు అవకాశాలు రావని తెలిసినా సరే నాకు జరిగిన సంఘటన గురించి నేను అందరితో పంచుకోవాలని ఈ విషయాన్ని చెబుతున్నాను’’ అని చెప్పుకొచ్చింది. కానీ ఆ హీరో పేరు మాత్రం వెల్లడించలేదు. దీంతో ఆమె పోస్ట్ సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ఇక అది చూసిన నెటిజన్లు రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు.