Ustad Bhagat Singh : అప్పుడు అంతాక్షరి.. ఇప్పుడేంటో తెలుసా?

by Pulgam srinivas |

తాజాగా హరీష్ శంకర్ మాట్లాడుతూ... 'ఉస్తాద్ భగత్ సింగ్'లో గబ్బర్ సింగ్ చిత్రంలోని అంతాక్షరి సన్నివేశాన్ని మించిన బ్లాక్ ఉంటుందని చెప్పుకొచ్చాడు.

Ustad Bhagat Singh : అప్పుడు అంతాక్షరి.. ఇప్పుడేంటో తెలుసా?
X

దిశ, వెబ్ డెస్క్ : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో చాలా సంవత్సరాల క్రితం గబ్బర్ సింగ్ చిత్రం వచ్చింది. ఈ సినిమా కంటే ముందు పవన్ అనేక అపజయాలతో డీలా పడిపోయి ఉన్నాడు. అలాంటి సమయంలో ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర పెను సంచలనం సృష్టించి పవన్ కెరియర్ లోనే బ్లాక్ బస్టర్ సినిమాల లిస్టులో చేరిపోయింది. గబ్బర్ సింగ్ సెకండ్ హాఫ్ లో అంత్యాక్షరి సన్నివేశం ఉంటుంది. ఆ సీన్ నిడివి కాస్త ఎక్కువగానే ఉంటుంది, కానీ అది ఆద్యంతం ప్రేక్షకులను కట్టిపడేసే విధంగా ఉంటుంది.

ఆ సీన్లో ఉన్న కమెడియన్స్ అలాగే పవన్ అద్భుతమైన నటనను ప్రదర్శించారు. ఈ ఒక్క సీన్ వల్ల అనేకమంది సినిమాను రిపీటెడ్ గా చూశారు. ప్రస్తుతం పవన్, హరీష్ కాంబోలో ఉస్తాద్ భగత్ సింగ్ అనే చిత్రం రూపొందుతుంది. దీనిని మార్చి 26వ తేదీన విడుదల చేయనున్నారు. దానితో హరీష్ శంకర్ తాజాగా చాలామంది సినిమా జర్నలిస్టులతో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఆ ఇంటర్వ్యూలో ఆయనకు మీరు గతంలో పవన్ గారితో చేసిన గబ్బర్ సింగ్ సినిమాలో అంతాక్షరి సన్నివేశం బాగా పేలింది, దానివల్ల సినిమాకు వచ్చే ఆడియన్స్ సంఖ్య కూడా ఎక్కువయ్యింది, మరి ఈ సినిమాలో కూడా అలాంటి సన్నివేశం ఏదైనా ఉందా? అనే ప్రశ్న ఎదురైంది.

దానికి ఆయన సమాధానం చెబుతూ... నేను ఎప్పుడూ కూడా ఆ సినిమాలో హిట్ అయిన ఫార్ములాను ఇందులో వాడాలి అనుకోను. ఏదైనా సహజంగా రావాలి, అప్పుడే ప్రేక్షకులకు అది నచ్చుతుంది, సినిమాకు ప్లస్ అవుతుంది. ఇందులో అంత్యాక్షరి లాంటి సన్నివేశం లేదు, కానీ ఒక పవర్ఫుల్ బ్లాక్ మాత్రం ఉంది. అది జనాలను విపరీతంగా ఆకట్టుకుంటుంది, జనాలు మళ్లీ మళ్లీ సినిమాకు వచ్చే విధంగా చేస్తుంది అని హరీష్ శంకర్ చెప్పుకొచ్చాడు.

Next Story