- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఈ కథ వెనుకున్న ఆలోచన అదే..
మార్చి 6న సరస్వతి మూవీ థియేటర్స్‌లో విడుదల కానుండగా.. నిర్మాత పూజా శరత్ కుమార్ సినిమా విశేషాలు పంచకున్నారు.

దిశ, సినిమా: వెర్సటైల్ పాత్రలతో అలరిస్తున్న వరలక్ష్మి శరత్ కుమార్ స్వీయ దర్శకత్వంలో, తన సోదరి పూజా శరత్ కుమార్‌తో కలిసి దోస డైరీస్ బ్యానర్ పై నిర్మిస్తున్న చిత్రం ‘సరస్వతి’. హై-కాన్సెప్ట్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ చిత్రం నుంచి ఇప్పటికే విడుదలైన ట్రైలర్ ప్రేక్షకులలో క్యురియాసిటీ పెంచింది. మార్చి 6న ఈ సినిమా థియేటర్స్‌లో విడుదల కానుండగా.. నిర్మాత పూజా శరత్ కుమార్ సినిమా విశేషాలు పంచకున్నారు. ‘సరస్వతి మంచి థ్రిల్లింగ్ ఎలిమెంట్స్, ట్విస్టులు ఉన్న వన్ ప్యాకేజ్ పటాక. మీరందరూ చాలా ఎంజాయ్ చేస్తారు. రెండు గంటల సినిమాని ఎంత గ్రిప్పింగా చేయాలో అంత అద్భుతంగా తీర్చిదిద్దాం. వరలక్ష్మి మంచి విజన్‌తో ప్రియమణి క్యారెక్టర్‌ని డిజైన్ చేసింది. ఆ క్యారెక్టర్‌కి ప్రియమణి పర్ఫెక్ట్ యాప్ట్. చాలా మంచి పెర్ఫార్మన్స్ ఇచ్చారు. సరస్వతి క్రైమ్ థ్రిల్లర్. చాలా మంచి సోషల్ మెసేజ్ ఉంది. ఈ ట్రైలర్‌లో ప్రతి అమ్మాయి సరస్వతి లాగా ఉండదు సమయం వస్తే కాళీలా మారుతుంది అనే ఒక డైలాగ్ ఉంది. ఈ కథ వెనుక ఉన్న ఆలోచన అదే. ఒక స్ట్రాంగ్ విమెన్ క్యారెక్టర్ ఇందులో చూస్తారు. చాలా బలమైన కథ ఇది. సినిమా చూస్తున్నప్పుడు ఆడియన్స్ కథకి చాలా కనెక్ట్ అవుతారు’ అని చెప్పుకొచ్చారు.






