'రణబాలి'కి హైలైట్ అదే.. ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన దర్శకుడు

by Pulgam srinivas |

‘రణబాలి’లో విజయ్, ఆర్నాల్డ్ మధ్య వచ్చే యాక్షన్ సీక్వెన్స్ సినిమాకే అతిపెద్ద హైలైట్‌గా నిలుస్తుందని రాహుల్ సంకృత్యాన్ తెలిపారు.

రణబాలికి హైలైట్ అదే.. ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన దర్శకుడు
X

దిశ, వెబ్ డెస్క్: విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంటగా నటిస్తున్న చిత్రం ‘రణబాలి’. ఈ సినిమాకు రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్ర షూటింగ్ దాదాపు పూర్తయింది. తాజాగా ఈ మూవీ గురించి దర్శకుడు రాహుల్ సంకృత్యాన్ కొన్ని ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు. రాహుల్ మాట్లాడుతూ, ‘రణబాలి’ చిత్రంలో ఎన్నో అద్భుతమైన సన్నివేశాలు ఉన్నప్పటికీ, వాటిలో విజయ్ దేవరకొండ మరియు విలన్ ఆర్నాల్డ్ వోస్లూ మధ్య వచ్చే క్లైమాక్స్ యాక్షన్ సీక్వెన్స్ సినిమాకే అతిపెద్ద హైలైట్‌గా నిలుస్తుందని చెప్పారు.

ఈ యాక్షన్ ఎపిసోడ్‌ను ఏకంగా 15 రోజుల పాటు చిత్రీకరించామని, ఇది అన్ని వర్గాల ప్రేక్షకులను తప్పకుండా ఆకట్టుకుంటుందని ఆయన వెల్లడించారు. ఈ సినిమాలోని యాక్షన్ సన్నివేశాల గురించి దర్శకుడు ఇంత నమ్మకంగా మాట్లాడడంతో, ‘రణబాలి’పై ప్రేక్షకుల్లో అంచనాలు మరింత పెరిగాయి. ఇప్పటికే విజయ్ దేవరకొండ–రాహుల్ సంకృత్యాన్ కాంబినేషన్‌లో వచ్చిన ‘టాక్సీవాలా’ మంచి విజయం సాధించిన నేపథ్యంలో, ఈ సినిమా కూడా అదే స్థాయిలో సక్సెస్ అందుకుంటుందనే నమ్మకంతో అభిమానులు ఉన్నారు. మరి ‘రణబాలి’ బాక్సాఫీస్ వద్ద ఏ స్థాయి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

Next Story