- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘పెద్ది’కి అద్భుతంగా కలిసి రానున్న అంశం అదే
ఐపీఎల్ మే 31తో ముగియనుండటం, ‘పెద్ది’ జూన్ 4న విడుదల కానుండటంతో ఈ సినిమాకు ఇది బాగా కలిసి వచ్చే అంశమని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

దిశ, వెబ్ డెస్క్: చాలా సంవత్సరాలు వెనక్కి వెళ్లి చూస్తే, సినిమా ఇండస్ట్రీకి సమ్మర్ సీజన్ అనేది అద్భుతమైన సమయంగా ఉండేది. అందుకు ప్రధాన కారణం ఆ సమయంలో పిల్లలకు సెలవులు ఉండడం. దీంతో కుటుంబ సభ్యులు అంతా కలిసి సినిమాలకు వెళ్లేందుకు ఆసక్తి చూపేవారు. ఫలితంగా సమ్మర్‌లో విడుదలైన చిత్రాలు భారీ కలెక్షన్లను రాబట్టేవి. అందుకే మేకర్స్ కూడా తమ సినిమాలను ఈ సీజన్‌లో విడుదల చేయడానికి ఎక్కువగా ఆసక్తి చూపేవారు. అయితే ఆ తర్వాత ఇండియాలో ఐపీఎల్ సందడి మొదలైంది.
దేశంలో క్రికెట్ అభిమానులు పెద్ద సంఖ్యలో ఉండడం, సమ్మర్‌లో చాలా రోజుల పాటు ఐపీఎల్ మ్యాచ్‌లు కొనసాగడంతో ముఖ్యంగా ఫస్ట్ షో, సెకండ్ షోలకు థియేటర్లలో ప్రేక్షకుల తాకిడి కొంత మేర తగ్గిన సందర్భాలు కనిపించాయి. ఈ కారణంగా ఐపీఎల్ సీజన్ సినిమాల కలెక్షన్లపై ప్రభావం చూపుతోందని మేకర్స్ పలుమార్లు అభిప్రాయపడిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇక ఇప్పుడు రామ్ చరణ్ హీరోగా తెరకెక్కిన పెద్ది చిత్రాన్ని జూన్ 4న విడుదల చేయనున్నారు.
మే 31తో ఐపీఎల్ ముగియనుండటంతో ఈ సినిమాకు ఐపీఎల్ ఎఫెక్ట్ పెద్దగా ఉండదని సినీ వర్గాలు భావిస్తున్నాయి. దీంతో సినిమాకు కాస్త పాజిటివ్ టాక్ వచ్చినా కూడా భారీ కలెక్షన్లు సాధించే అవకాశాలు ఉన్నాయని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ముఖ్యంగా ఐపీఎల్ ప్రభావం లేకపోవడం పెద్ది చిత్రానికి అద్భుతంగా కలిసి వచ్చే అంశమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటించగా, బుచ్చిబాబు సనా దర్శకత్వం వహించారు.






